ప్రమోషన్ కొట్టేసిన బిత్తిరి సత్తి

0
749

ప్రజలను నవ్వించడం అంత సులభం కాదు. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉండాలి.. నవ్వు తెప్పించగల హావభావాలు పలకాలి.. ఎదుటోటికి దిమ్మతిరిగే పంచ్‌లు వేయగలగాలి.. ఈ కలలన్నీ ఓ గ్లాసులో మిక్స్ చేసి, సరైన ఔట్‌పుట్ రాబట్టగలిగితే.. అప్పుడే ఇతరులను నవ్వించగలం. నిజానికి.. ఇండస్ట్రీలో ఎందరో కమెడియన్స్ ఉన్నారు కానీ, వారిలో చాలామంది నామమాత్రమే. కొందరే తమ సత్తా చాటుకుంటున్నారు. వారిలో బిత్తిరి సత్తి ఒకరు. తనదైన యాసతో, విభిన్న స్టైల్‌తో నవ్వించడంలో ఇతనికి ఇతనే సాటి. ఇతడ్ని కేవలం కమెడియన్‌గా కంటే సంచలనంగా చెప్పుకోవచ్చు. 

ఆ పాపులారిటీ కారణంగానే బిత్తిరి సత్తికి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ‘ఇద్దరిమధ్యా 18’ అనే సినిమాలో ఓ కామెడీ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో బిత్తిరి సత్తి ఎప్పట్లాగే తనదైన నటన, కామెడీ టైమింగ్‌తో అదరొట్టేశాడు. ట్రైలర్‌లో ఇతని ఎంట్రీయే అదిరిపోయింది. బజాజ్ చేతక్ బండిపై కూర్చొని, నోట్లో కత్తి పెట్టుకుని, బ్యాక్‌గ్రౌండ్‌లో ‘రక్తచరిత్ర’ థీమ్ సౌండ్‌తో రౌద్రుడిలా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ తన ఫన్నీ అవతారంతో కడుపుబ్బా నవ్వించాడు. మందు మీద చెప్పిన పద్యం, పోలీస్ స్టేషన్‌లో చేసిన హంగామా, ఒక్కటే ఓవర్లో కొట్టిపడేస్తా.. సత్తిగాడు మాంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఈ ట్రైలర్‌లో బిత్తరి సత్తినే హైలైట్ చేస్తూ చూపించడాన్ని బట్టి చూస్తే.. సినిమా మొత్తంలో ఇతనికి బాగానే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

బుల్లితెర ఆడియెన్స్‌ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూ తనదైన ముద్ర వేసుకున్న బిత్తిరి సత్తి.. సినిమాల్లోనూ అలాగే రాణిస్తాడని, కమెడియన్స్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదిస్తాడని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here