దర్శకుడు వేణు ఉడుగుల కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అని అనడానికి నిదర్శనమే వేణన్న Venu Udugula
ఐదేండ్ల క్రితం ఒక సామాన్యుడిగా ఉన్నప్పుడు నాకు పరిచయం. అప్పుడప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎదుగుతున్న క్రమంలో నాకు పరిచయం అయ్యాడు. నాటి నుండి నేటి వరకి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సినిమా పరిశ్రమలో ఒక గుర్తింపు వచ్చింది. “నీది నాది ఒకే కథ” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి తనకంటూ ఒక ప్రత్యెక శైలిని మొదటి చిత్రంతోనే ఏర్పరచుకొని తన రెండవ చిత్రం “విరాట పర్వం” లో ఒక స్టార్ హీరో అయిన రానా దగ్గుబాటి తో త్వరలో మన ముందుకు వస్తున్నాడు. “ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి” అనే సామెతని వేణన్నకి అన్వయించవచ్చు. ఎందుకంటే ఐదేండ్ల క్రితం ఎలా ఉన్నాడో ప్రస్తుతం కూడా అన్న అలానే ఉన్నాడు. జీవితంలో ఏదైనా సాధించాలని అనే కసి ఉన్నవాళ్లు ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి వేణన్న. వేణన్న ఒక డైరెక్టర్ గానే కాకుండా స్వతహాగా కవి. సమాజంలో జరిగే అసమానతలపై ఎన్నో కవితలు రాసి తనలో ఒక సామాజికవేత్త మరియు బడుగు బలహీన ప్రజల కోసం నేను కూడా ఆలోచిస్తా అని తన కవితల ద్వారా తన గళాన్ని వినిపిస్తాడు. నేను అత్యంత అభిమానించే వ్యక్తుల్లో వేణన్న ఒకరు అని చెప్పడానికి గర్వపడుతాను. ఈరోజు వేణన్న పుట్టినరోజు సంధర్భంగా జన్మదిన శుభాకాంక్షలు Venu Udugula 💐💐💐.

Srinivas Dasari

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close