టాలీవుడ్ భరతం పట్టిన భరత్

0
1720
Barath Phone exposed drugs mafia links
Barath Phone exposed drugs mafia links
    ఎంతో మందికి ఉపాధినిచ్చే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఒక డ్రగ్స్ రాకెట్ ఉచ్చులో కొట్టుమిట్టాడుతుంది. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి బడా బడా నిర్మాతలు, నటీ నటులు ఈ డ్రగ్స్ రాకేట్ ఉచ్చులో బిగుసుకుపోయినట్లు తెలుస్తుంది.
    ఈ డ్రగ్స్ రాకెట్ చిత్ర పరిశ్రమకి ఇప్పుడిప్పుడే వచ్చిందేం కాదు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని బట్టబయలు చేసింది మాత్రం ఇటీవల మరణించిన భరత్ అని కచ్చితంగా చెప్పవచ్చు. భరత్ చనిపోయి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద అలజడిని రేపాడు. హీరో రవితేజ తమ్ముడిగా చిత్ర పరిశ్రమకి పరిచయమైన భరత్ కొన్ని రోజుల క్రితం అధికంగా మధ్యం సేవించడంతో పాటు డ్రగ్స్ కూడ తీసుకొని వాహానం నడుపుతూ రోడ్డు ప్రమాదం లో మరణించాడు. అప్పుడు భరత్ కారులోని అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకి డ్రగ్స్ సప్లై చేసే ముఠాతో భరత్ కి సంబంధాలు ఉన్నట్లు గుర్తించటంతో విచారణలో వేగం పెంచారు . అలాగే భరత్ కి డ్రగ్స్ సప్లై చేసే కెల్వీన్ ను అరెస్ట్ చేసి అతని దగ్గర డ్రగ్స్ తీసుకునే వారి వివరాలను సంపాధించారు.
    భరత్ తో పాటు రవితేజ , పూరీ జగన్నాథ్, ఛార్మీ , సుబ్బరాజు, శ్యాం కె నాయుడు, శ్రీనివాస రాజు తో పాటు మరి కొందరి పేర్లు బయటకి రావడంతో చిత్ర పరిశ్రమలో ప్రకంపణలు చెలరేగాయి. దీనితో పోలీసులు డ్రగ్స్ కొనుగోలు చేసిన వారికి నోటీసులు జారీ చేసారు. ఇలా భరత్ చనిపోయి టాలీవుడ్ ప్రముఖుల డ్రగ్స్ రాకెట్ ఉచ్చును బట్టబయలు చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here