భలే భలే సినిమాకు ఒక్క ఫిలింఫేర్ రాలేదేంటి?

0
1202

నిన్న హైద్రాబాద్ లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో అందరూ అనుకున్నట్లే బాహుబలి ,శ్రీమంతుడు ,రుద్రమదేవి సినిమాలకు మంచి ఆదరణే లభించింది. మహేష్ బెస్ట్ యాక్టర్ ,రాజమౌళి బెస్ట్ దర్శకుడు ,గోన గన్నా రెడ్డి కి బెస్ట్ సపోర్టింగ్ అవార్డు , రుద్రమదేవి అనుష్క కి బెస్ట్ నటి ,దేవిశ్రీ కి ఉత్తమ సంగీత దర్శకుడు ,ఉత్తమ చిత్రం బాహుబలి అవార్డు లు కొల్లగొట్టాయి. అంత బాగుంది కానీ ఒక సినిమా యూనిట్ ని మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది . అది భలే భలే మగాడివోయ్ సినిమా యూనిట్.

గత ఏడాది విడుదల అయినా ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై 50 కోట్లను కొల్లగొట్టింది. మంచి స్క్రిప్ట్ ,మారుతి దర్శక పటిమ ,నాని నట విశ్వరూపం ,మంచి పాటలు,ఔట్ ఔట్ అండ్ కామెడీ ,దానికి మించి మతిమరుపు అనే పాయింట్ మీదా సినిమా మొత్తం నడిపిస్తూ ప్రేక్షకులను సీట్లకే పరిమితం చేసింది. ఒక విదంగా చెప్పాలంటే గత ఏడాది ఒక సినిమాను 3,4 సార్లు చూసిన సినిమా ఏదైనా ఉందంటే ఖఛ్చితంగా భలే భలే మగాడివోయ్ సినిమా అని చెప్పొచ్చూ. బొమ్మరిల్లు సినిమా తరువాత ఆ ఫీట్ ని సాధించిన సినిమా ఇదే. చాలా మంది బాహుబలి,శ్రీమంతుడు సినిమాలను రెండొవ సారి చూడలేదు కానీ చాలా మంది ఈ సినిమాను చూసారు. ఈ సినిమాకు అవార్డులు అంచనాలు పెట్టుకున్న యూనిట్ కనీసం నాని నటనకు అవార్డు వస్తుందని అనుకున్నారట. కానీ చివరికి ఒక్క అవార్డు కూడా రాలేదు. నిజానికి బాహుబలి,రుద్రమ దేవి లాంటి అరుదైన సినిమాలు వఛ్చినపుడు మిగతా సినిమాలను పట్టించుకోకపోవటం జరుగుతాయి. ఇది ఏమైనా కూడా అవార్డులకు పోటీ పడే సినిమాలు గత సంవత్సరం రావటం కూడా మంచిదే కదా . దానితో పాటు అవార్డు లు రాకున్నా డబ్బులు వచ్చాయి కాబట్టి ,బాధ పడాల్సిన అవసరం లేదు లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here