చల్ల చల్లని నవ్వుల మగాడు

0
383

రేటింగ్ : 3.25/5
నటీనటులు- నాని – లావణ్య త్రిపాఠి – మురళీ శర్మ – వెన్నెల కిషోర్ – అజయ్ – నరేష్ – సితార – మధుమిత – ప్రవీణ్ – శ్రీనివాసరెడ్డి తదితరులు
ఛాయాగ్రహణం – నిజార్ షఫి
సంగీతం – గోపి సుందర్
నిర్మాతలు – బన్నీ వాస్ వంశీ
రచన దర్శకత్వం – మారుతి దాసరి
కథ:
లక్కరాజు ఊరఫ్ లక్కీ (నాని)  కి మతిమరుపు . చిన్న చిన్న విషయాలు మరిచిపోయే మాగాడు దాని వలన చాల ఇబ్బందులు ఎదురవుతాయి, ఈ మతిమరుపు వల్లే అతడికి పెళ్లి కూడా అవదు. ఐతే  అనుకోకుండా నందన (లావణ్య) లక్కీకి పరిచయ భాగ్యం దక్కుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఐతే లక్కి మతిమరుపు వలన ఆయనని అసహ్యించుకునే వ్యక్తే తనకు కాబోయే మావ అని లక్కీకి తెలుస్తుంది. ఇలాంటి స్థితిలో తన మతిమరుపు గురించి తన ప్రేయసికి తెలియకుండా తానెవరో తన మామకు చెప్పకుండా లక్కీ ఎలా మేనేజ్ చేశాడు? చివరికి నిజాలు బయటపడిపోయాక ఏం చేశాడు? అన్నది మిగతా కథ.

 

విశ్లేషణ:
ఈ రోజుల్లో ,బస్సు స్టాప్ సినిమా లతో చిన్న సినిమాల పెద్ద దర్శకుడిగా పేరు గావించిన మారుతీ కి ఉన్న సెన్స్ అఫ్ హుమార్ ని హీరో కి మతిమరుపు అనే కాన్సెప్ట్ తో సెట్స్ పైకి వెళ్లి ,నాని లాంటి సహజ నటుడు తోడై, గీతా ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థ తోడైందంటే కచ్చితంగా సినిమా బాగుంటుందని అందరు అనుకుంటారు . మన చుట్టూ ఇలాంటి క్యారెక్టర్లకు కొదవేం ఉండదు.. ఆ మాటకొస్తే ప్రతి వ్యక్తీ ఈ మతిమరుపుతో ఇబ్బంది పడే వాడే కాబట్టి.. ప్రేక్షకులు ఈజీగా కనెక్టయిపోయే అవకావశముంది. ఐతే సినిమా కాబట్టి కొంచెం డోసు పెంచి.. వినోదం పండించాడు మారుతి.
ఫస్ట్ హాఫ్ నాని కామెడీ తోడైతే ,సెకండ్ హాఫ్ లో ఆయనకి వెన్నెల కిశోరే తోడై నవ్వులు కురిపించారు .
లావణ్య త్రిపతి అందం అభినయం బాగుంది ,గోపి సుందర్ సంగీతం బాగుంది.

ప్లస్ పాయింట్స్
కథ ,కథనం
నాని
మాటలు ,దర్శకత్వం
కామెడీ
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్

verdict : చల్ల చల్లని నవ్వుల మగాడు 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here