బాసరకు డిజిటల్ అభ్యాసం

0
389

తెలంగాణా రాష్రం లో ,హైదరాబాద్ నగరానికి 200 కిలో మీటర్ల దూరంలో ఆదిలాబాద్ జిల్లాలోని బాసర గ్రామం అంటే దేశంలో ప్రత్యేకత ,ప్రపంచానికి చదువు చెపుతునున్న గ్రామం . గోదావరి నది తీరాన కొలువై ఉన్న దేశంలో కెల్లా జమ్మూ కాశ్మీర్ తర్వాత సరస్వతి పీఠం. హిందువులు ఆరాదించే ఈ సరస్వతి మాత కొలువులో ప్రతీ రోజు వెలది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ప్రపంచానికి చదువులు నేర్పే గ్రామం. అలాంటి గ్రామానికి కంప్యూటర్ చదువులు చెపితే ఎలా ఉంటుంది?
అది కూడా తెలంగాణాలో మొట్ట మొదటి డిజిటల్ గ్రామంగా చరిత్రకి ఎక్కిస్తే ఈ విదంగా ఉంటుంది ? ఇలాంటి ఆలోచచనలు తెలంగాణా ఐటి అసోసియేషన్ (TITA) యువకులకు వచ్చింది ,దీనితో ఆలస్యం చేయకుండా తెలంగాణా ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ తో చర్చించి ,ప్రదాని నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా ,సిఎం కెసిఆర్ నిర్వహిస్తున్న డిజిటల్ తెలంగాణా కార్యక్రమానికి సపోర్ట్ గా డిజితాన్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టి బాసర -IIIT ప్రొఫెసర్లు ,విద్యార్థులతో కలిసి ,జాతీయ సాక్షరతా అభియాన్ -NDLM తో చేతులు కలిపి బాసర గ్రామా ప్రజలకు డిజిటల్ అభ్యాసం డిసెంబర్ 17 , 2015 న మొదలు చేసారు.

బాసర గ్రామంలో ప్రతి ఇంటిలో కనీసం ఒక మనిషి కి డిజిటల్ పాఠాలు నేర్పించాలనే లక్ష్యంతో TITA ,IIIT -బాసర లు చేతులు కలిపి ,”ట్రైన్ ది ట్రైనర్” అనే కాన్సెప్ట్ తో గ్రామంలో 600 మంది డిజిటల్ నాయకులను తయారుచేసి చరిత్ర సృష్టించారు. దీనిలో బాగంగా డిజిటల్ లీడర్స్ 2100 ఇల్లున్న గ్రామంలో ఇంటింటికి సర్వే నిర్వహిస్తే ,475 గృహాలు డిజిటల్ నిరక్షరాస్యత కలిగిన గుర్తుంచారు. అపుడు ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తికీ తీసుకొని 475 మంది డిజిటల్ అక్షరాస్యులను 7
వారాల్లో తర్పీదు ఇచ్చారు.
భవిష్యత్తులో డిజిటల్ అక్షరాస్యతని కొనసాగించటానికి TITA కార్యవర్గ సభ్యులు వెంకట వనం ,ప్రవీణ్ మాడిరాజు ,మనోజ్ తాటికొండ గారు బాసరలోని ఉన్నత పాటశాల కి చెరొక కంప్యూటర్ సిస్టం ఇచ్చారు.

ముగింపు కార్యక్రంలో పాల్గొన్న ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ ,బాసర ని “100% డిజిటల్ అక్షరాస్యత కల్గిన గ్రామం గా ప్రకటించాడు. అయన మాట్లాడుతూ “ఈ రోజు బాసర గ్రామం చరిత్ర సృష్టించింది. ఈ ఘనత కి కారణమైన TITA టీం కిధన్యవాదాలు ,బాసర ప్రజలు అభినందనలు . రాబోయే కాలంలో TITA తెలంగాణా లోని అన్ని గ్రామాలను దత్తత తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను “. బాసర గ్రామా సర్పంచ్ TITA కి ధన్యవాదాలు తెలిపారు.
అదే రోజు నిజామాబాదు లో ఉన్న తెలంగాణా విశ్వవిద్యాలయం లోని నరింగ్పట్నం గ్రామాన్ని జయేష్ రంజన్ గారి చేతుల మీదుగా దత్తత తీసుకొని దిగితాన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
ఈ కార్యక్రమంలో ,IIIT -బాసర వైస్ చాన్సలర్ సత్య నారాయణ ,TITA అద్యక్షుడు సందీప్ మక్తలా ,నవీన్ గడ్డం ,రానా ప్రతాప్ మరియి ఇతర కార్యవర్గ సబ్యులు వెంకట వనం ,అశ్విన్ చంద్ర ,ప్రవీణ్ మాడిరాజు ,శ్రీనివాస్ గౌడ్ ,కిరణ్ జెట్టి ,రవి లెల్ల ,విశ్వక్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here