తెలంగాణ గల్ఫ్ ప్రతినిధికి అరుదైన జాతీయ పురస్కారం

0
441

దళిత కళాకారులకు ,దళితుల వృద్ధికి పడే వ్యక్తులకు ,స్వచ్చంద సంస్థలకు ప్రోత్సహించటానికి 1984 లో ఏర్పడిన భారతీయ దళిత అకాడమీ ప్రతి ఏడాది అంబెడ్కర్ పేరిట జాతీయ పురస్కారాలను ఇస్తుంది.

ఐతే ఈ సంవత్సరం ఢిల్లీలో జరిగిన 32 వ అఖిల భారత రచయితల జాతీయ సమ్మేళనం సందర్బంగా నిజామాబాదు జిల్లాకు చెందిన గల్ఫ్ బాధితుల ప్రతినిధి పట్కూరి బసంత్ రెడ్డి గారికి ఈ అవార్డు వరించింది.ఈ అవార్డు ను కేంద్ర మంత్రి రామ్ పాశ్వాన్ గారి చేతుల మీదుగా బసంత్ రెడ్డి గారు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ,ఎస్టీ,బిసి గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తూ వాళ్ళ అభ్యున్నతి కి పాటు పడుతున్నందుకు ఈ అవార్డు ఇచ్చారు. ఈయన గల్ఫ్ లో చనిపోయిన కార్మికుల మృత దేహాలను భారత దేశానికి తరలించడంలో గత దశాబ్ద కాలంలో ఎనలేని సేవలు అందించారు.అయన స్వంత పాస్ పోర్టును ఎంబసీ దగ్గర తాకట్టు పెట్టి మృతదేహాలను ఆయా కుటుంబాలకు చేర్చి చివరి చూపులకు కృషి చేసాడు. అంతే కాకుండా ఆస్ట్రేలియాలోని ఒక యూనివర్సిటీ తో తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులు కోసం  స్కిల్ డెవెలెప్మెంట్ ఒప్పందం  చేయటానికి కీలకపాత్ర వహించాడు. ఈ అవార్డు తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక మొదటిసారి బసంత్ రెడ్డి కి ఇవ్వటం కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here