బండ్ల ట్విట్ కేసీఆర్ మీద ప్రేమా లేక జగన్ మీద కోపమా?

87 0

మనిషిని పొగడంలో బండ్ల గణేష్ ని మించినవారు లేరేమో అనిపిస్తుంది.పొగడ్తల్లో ఆయన బ్రాండ్ అంబాసిడర్ లా అనిపిస్తాడు.సీఎం కేసీఆర్ పై సినీ నిర్మాత కమ్ కమెడియన్ బండ్ల గణేశ్ మరోసారి పొగడ్తలు కురిపించారు. ‘మనమెవ్వరమూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. జీవించిన కాలంలో ఎంత గొప్పగా బతికాం, ఎంత ఆదర్శవంతంగా ఉన్నాం అనేదే ముఖ్యం’ అని ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… ‘నిజాయతీ మీ యశస్సు, నీతి మీ ఆయుష్షు… జై కేసీఆర్’ అని ట్వీట్ చేసి కేసీఆర్ ని ఆకశానేత్తాడు.
అంతే కాకుండాఏపీ నాయకులపై బండ్ల గణేశ్ తీవ్ర విరుచుకుపడ్డాడు. టీవీలు చూస్తుంటే ఏపీ రాజకీయ నాయకులు ప్రతి నెల ఎలక్షన్స్ వస్తాయేమో అనే భయంతో టీవీ చర్చల్లో పాల్గొంటున్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయనే విషయాన్ని ఏపీ రాజకీయ నాయకులు, ప్రజలు గమనించాలని సూచించారు.

తెలంగాణ రాజకీయ నాయకులను చూసి కష్టకాలంలో ఎలా ఉండాలో నేర్చుకోండని బండ్ల గణేశ్ హితవు పలికారు.

తెలంగాణ వాసి అయిన గణేష్ ఆంధ్ర రాజకీయాల మీద ఎందుకు అంత మక్కువ చూపుతున్నాడానే విషయాన్ని విశ్లేశకులు విశ్లేషిస్తూ తనకు బాగా ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు శత్రువు జగన్ ప్రభుత్వం మీద పరోక్షంగా కేసీఆర్ పొగుడుతో విమర్శలు చేస్తున్నాడు కాని ఇది కేసీఆర్ మీద ప్రేమతో కాదని అంటున్నారు. ఇది కూడా నిజమే ఎందుకంటే ఒకప్పుడు సీఎం కేసీఆర్ ని బాగా విమర్శించాడు కదా…

 

Related Post

గ్రేటర్ ఎన్నికల పైన ప్రముఖ జర్నలిస్ట్ దుర్గం రవీందర్ అభిప్రాయం

గ్రేటర్‌ ఎన్నికల్లో వోట్లు,సీట్లు పొందడం బీజేపీ కంటే కేసీఆర్‌కే ఎక్కువ అవసరం గ్రేటర్‌ హైదరా బాద్ ఎన్నికల్లో రాజకీయాలు పోటా పోటీగా సాగుతున్నాయి.పోరు మొత్తం టీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య…

తెల్లరేషన్ కార్డ్ లేని నిరుపేదలకు ప్రభుత్వం సహకారం అందించాలి : బస్వా లక్ష్మి నర్సయ్య

Posted by - April 16, 2020 0
తెల్లరేషన్ కార్డ్ లేని నిరుపేదలకు ప్రభుత్వం సహకారం అందించాలి అని నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, జిల్లా కలెక్టర్, నిజామాబాద్…

అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నర్సాపూర్ లో మహిళా రైతులకు సన్మానం

  సృష్టికి మూలం అమ్మ అలాంటి అమ్మ ప్రపంచ ఆకలి తీర్చడానికి రైతుగా వారి శ్రమని ఆహారంగా మార్చి అందరి ఆకలి తీరుస్తున్న మహిళ మణులకు సేవ్…

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఐకేపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు

కమ్మర్పల్లి మండల్ హసకొత్తూర్ లో గ్రామ డ్వాక్రా మహిళలతో కలిసి ఐకెపి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా గ్రామ మహిళా సమాఖ్య…

భీమగల్లో రైతు కాన్సెప్ట్ తో కూడిన తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆర్మూర్ ఏసీపీ రఘ, సిఐ సైదయ్య,మల్లెల లక్ష్మణ్

ఈ రోజు భీమగల్ పోలీస్ స్టేషన్లో స తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆర్మూర్ ఏసీపీ రఘు, సిఐ సైదయ్య,ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి ,…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *