తెలంగాణా తెల్లన్నానికి పేటెంట్ తీసుకో బాలయ్య ….

0
1221

చట్నిస్ రెస్టారెంట్ లో చాల రకాల దోసలు ,ఇడ్లీలు బాగా ఫేమస్ కాని ఒక దోసా మాత్రం అందరిని ఆకర్షిస్తుంది. అదే చిరంజీవి దోసా గా పిలవబడే స్ట్రీమ్ దోసా. ఆ దోస రెసిపీ చిరంజీవి ఇవ్వటం వలన ఆ హోటల్ వాళ్ళు చిరంజీవి గారి పేరు పెట్టి ఆ దోసాని ఫేమస్ చేసారు. ఆ మద్య మెగా స్టార్ చిరంజీవి గారి 60 వ పుట్టిన రోజుకి అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక మంచి బహుమతి ఇచ్చాడు. అదేంటంటే ఆ దోసకి పేటెంట్ తీసుకొని చిరుకి ఇచ్చాడు.

చరణ్ వాళ్ళ నాన్నకు దోస పేటెంట్ ఇస్తే బాలయ్య కూడా తను కూడా ఏమి తక్కువ తినలేదు అనుకున్నాడు అనుకుంటా ,తెలంగాణా తెల్లన్నానికి వాళ్ళ నాన్నకు లింక్ పెట్టాడు. అసలు విషయానికొస్తే ఈ మద్య బాలయ్య బాబు ఒక సంచలన మాటలు మాట్లాడాడు. ఒకప్పుడు తెలంగాణ ప్రజానీకానికి అసలు తెల్లన్నం అంటే ఏమిటో తెలియదని, దాన్ని మా నాన్న ఎన్టీఆర్ గారు తెలంగాణా ప్రజలకు పరిచయం చేసాడు” అని అన్నాడు. దీంతో తెలంగాణా వాదులు ఒక్కసారిగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు హైదరాబాద్ బిర్యానీ చరిత్ర తెలియకుండా మాట్లాడాడో లేక బిర్యనిలో అన్నాన్ని వాడుతారు అని తెలియక వ్యాక్యాలు చేశాడో కాని చాలా చివాట్లు ఎదుర్కుంటున్నాడు. ఏది ఏమైనా ఈ మద్య మామ అల్లుళ్ళు అయిన బాలయ్య -లోకేష్ లు అనవసర వ్యాక్యాలు చేస్తూ దొరికిపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here