శాతకర్ణి కోసం దిన పత్రిక రుద్దుడు ప్రచారం

0
832

            ఆదివారం అంటే చాలు నాన్ వెజ్ ,మందు ,విందులు ,మిత్రులు ఇలా మన దినందిన జీవితంలో బిజీ లైఫ్ కి సేదతీరుస్తుంది. తెలుగు వాళ్ళు ఇవే కాకుండా మరొక వస్తువు కోసం సండే ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అదే సండే మ్యాగజైన్. ఆ కవర్ స్టోరీలు ,పిల్లల పజిళ్లు ,పెద్దల పద వినోదం ,ఫ్యామిలీ వ్యాసాలు, సినిమా వార్తలు,క్రీడా వార్తలు ఇలా సండే మొత్తం రిలీఫ్ నిస్తాయి. ఇపుడున్న మేజర్ దినపత్రికల్లో అన్ని కూడా సండే ఎడిషన్లను ప్రచురిస్తాయి. ఐతే అపుడపుడు ఆయా పేపర్ వాళ్ళు కొన్ని ప్రైవేట్ ప్రచారాలకు తావునిస్తారు.

                                                                                                                                         ఇదే విదంగా ఇటీవల ఒక పత్రిక సండే ఎడిషన్లో శాతకర్ణి గురుంచి వచ్చింది. అది బాగానే ఉంది ఎందుకంటే అది ఒక మైల్ స్టోన్ సినిమా కావటం వలన ఆ కవర్ స్టోరీని ప్రచురించటం తప్పు లేదు. కాని ఆ సదరు పత్రిక వాళ్ళు మాత్రం రుద్దుడు ప్రచారం చేశారు. అసలు విషయానికొస్తే కూకట్పల్లి ఏరియాలో ఒక కాలనీలో చాల మంది ఈ పత్రిక చదువుతారు. ఒక 40% జనాలు వేరే పత్రిక చదువుతారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ మిగతా 40% ఇంట్లో సండే డోర్ తెరవగానే ఈ వాళ్ళ అభిమాన పత్రిక బదులు ఈ సదరు ప్రచార పత్రిక కనబడింది. తీరా పత్రిక చూస్తే సదరు సినిమా గురుంచి కవర్ స్టోరీ ఉంది. సరే ఎదో యాదృచ్చికంగా జరిగిందని అనుకున్నాడు.

 

                                                                                                                                                      చూస్తుండగానే సాయంత్రం గడిచిపోయింది ,ఆ సదరు వ్యక్తి ఈవెనింగ్ వాక్ కోసం దగ్గర ఉన్న పార్క్ కి వెళ్లి మిత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు.అపుడు ఈ వ్యక్తి అనుకొకుండా ఆయనకు తన అభిమాన పత్రిక సండే ఎడిషన్ రాలేదు,ఇంటర్నెట్ లో వీళ్ళున్నపుడు ఈ పేపర్లో చదివాను అని చెప్పాడు. ఈ విషయం విన్న మిగతా మిత్రులు కూడా నోరు వాళ్లకు కూడా ఇదే జరిగిందని చెప్పగానే అక్కడున్న ఒక లాయర్ అసలు విషయం చెప్పాడు.ఆ సదరు సినిమా కోసం ప్రచారం చేయటానికి ఇది ఒక చీఫ్ ట్రిక్ అని ,ఇలా అయితే జనాలు దినపత్రిక ని ఆపేసి తనకిష్టమైన పేపర్ ని ఇంటర్నెట్లో చదువుతారు అని చెప్పాడు. ఇలా ఉందండి ఈ ప్రచార వ్యవహారాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here