బాహుబలి కి మహాభారతానికి పోలికలు

0
1193

 

బాహుబలి పూర్తిగా ఊహాజనితం అని చెప్పిన రాజమౌళి కి చివరికి మహాభారతం రిఫరెన్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది . కొన్ని అంశాలు భారతం నుంచి  తీసుకున్నాడు,అవేంటో చూడండి .

1) మహాభారతం ఇద్దరు దాయాదుల పోరు ,బాహుబలి కూడా అంతే .

2) పెద్ద వాడైన దృతరాష్ట్రుడు పుట్టి గుడ్డి కనుక అయన తమ్ముడు పాండు రాజుకి రాజ్యం బాధ్యతలు వస్తాయి ,బాహుబలి లో కూడా బిజ్జలదేవ (నాజర్) కి అంగ వైకల్యం కనుక అయన తమ్ముడు రాజు అవుతాడు ,కాని బిజ్జలదేవ తమ్ముడు (బాహుబలి తండ్రి) ఎవరో చూపించలేదు.

3) భారతంలో అర్జునుడు ,దుర్యోధనుడు ఇద్దరు కౌరువ ,పాండవులలో మేటి వీరులు ,బాహుబలి లో కూడా బాహుబలి (ప్రభాస్),భల్లాలదేవా(రానా)లు వీరులు

4) భారతంలో అర్జునుడు విలు విద్యలో మేటి అయితే ,దుర్యోధనుడు గద యుద్ధం లో నిష్ణాతుడు, బాహుబలిలో కూడా బాహుబలి కి విలు విద్య ,భల్లాల దేవా కి గదని ఎన్ని రకాలు ఉపయోగించాలో చూయించారు .

5) భారతంలో ద్రోణాచార్యుడు ధర్మాత్ముడు అయిన సరే రాజనీతి తప్పకూడదని కౌరవుల వైపు ఉంటాడు ,ఇక్కడ కూడా కట్టప్ప (సత్యరాజ్ ) కూడా మంచోడే కాని ధర్మాన్ని తప్పకుండ రాజు అయిన రానా వైపు ఉంటాడు ,కాని ద్రోణుడు గురువు ఐతే కట్టప్ప సేనదిపతి .

6) కర్ణుడు గిరిజనులకి నీళ్ళల్లో దొరుకుతాడు ,మహేంద్ర బాహుబలి (చిన్న ప్రబాస్) కూడా గిరిజనులకి నీళ్ళల్లో దొరుకుతాడు .

7) అనుష్క పాత్ర దేవసేన కి ద్రౌపది కి వీరత్వంలో పోలికలు కనపడతాయి .

8) శివగామి పాత్ర గాందారిని పోలి ఉంటుంది ,ఎందుకంటే గాందారిని దుర్యోదనుడు అంటే నచ్చదు ,ఎక్కువగా పాండవులకి సపోర్ట్ ఇచ్చేది .       

   

ఎన్ని జానపదాలు ,కథలు వచ్చిన భారతంలో లేని పాత్రలు ,ఎమోషన్స్ ఉండవు ఎందుకంటే భారతం అంటే అనంతం . 

Author:Ravinder Ryada

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here