కోదాడ తెరాస గెలుపులో ఆజ్ఞాతవాసి

0
197

నల్గొండ జిల్లాలో కోదాడ ప్రాంతం విభిన్న ప్రాంతాలు,బలహీన వర్గాల ప్రజలకు పుట్టినిల్లు. ఒకప్పుడు టీడీపీ కంచుకోట గా ఉండే కోదాడ,2009 ,2004  ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడంతో కాంగ్రెస్ కోట గా మారిపోయింది.2009 లో నియోజకవర్గాల విభజనతో మళ్ళీ టీడీపీ కైవసం చేసుకుంది.2014 లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి పద్మావతి రెడ్డి గారు టీడీపీ అభ్యర్థి శ్రీ మల్లయ్య యాదవ్ గారి పైన గెలవడంతో మళ్ళీ కాంగ్రెస్ చేతిలోకి వచ్చింది.కానీ తెరాస మాత్రం ఇప్పటివరకు పోటీ ఇవ్వలేకపోయింది.అయితె ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి లో భాగంగా సీట్ కాంగ్రెస్ కి వెళ్ళటం వల్ల టీడీపీ నాయకుడు బొల్లం మల్లయ్య యాదవ్ అలకను కేటీఆర్ గారి చాకచక్యంతో తెరాస క్యాష్ చేసుకోని టికెట్ ఇచ్చి గట్టి పోటీ నిచ్చి చివరికి 800 ఓట్ల స్వల్ప తేడాతో మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యే గా గెలిచాడు. 
ఈ కోదాడ తెరాస గెలుపును విశ్లేషించుకుంటే తెరాస లో ఆజ్ఞతవాసి పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది.అయన ఎవరో కాదు గత 4 ఏళ్లుగా తెరాస శ్రేణుల్ని బలపరుస్తూ ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధికి పాటు పడుతూ,చెరువుల సంరక్షణ కోసం పట్టుపడ్డ ప్రవాస భారతీయుడు జలగం సుధీర్.
వాస్తవానికి కేటీఆర్ కి ఇష్టమైన అనుచరుడు అయిన సుధీర్ తెరాస లో టికెట్ ఆశించిన వారిలో  ప్రముఖుడు.ఈసారి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని నామినేషన్ వేసాడు.కేటీఆర్ చాకచక్యంతో సుధీర్ ని మెప్పించి నామినేషన్ ఉపసంహరించేలా చేసి మల్లయ్య యాదవ్ గెలుపుకు సుధీర్ ని భాగం చేసాడు.వాస్తవానికి బీజేపీ లాంటి ప్రధాన పార్టీలు టికెట్ బి ఫారం ఇస్తామని చెప్పినా కూడా కేటీఆర్ గారికి ఇచ్చిన మాట కోసం తెరాస గెలుపుకు ప్రయత్నించాడు.ఒకవేళ సుదీర్ పోటీ చేసుంటే ఎటు కాదన్న దాదాపు 10 వేల ఓట్లను తనవైపు లాక్కునే వాడని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

ప్రధానంగా కోదాడలో స్తబ్దుగా ఉన్న తటస్తులను,విద్యావంతులను,వైద్యులను,ఇతర బీసీ వర్గాలను తెరాసకు పని చేయించడంలో సుదీర్ తెరవెనుక కృషి చేసినట్లు స్థానికుల మేరకు సమాచారం.

ఏది ఏమైనా కోదాడ తెరాస గెలుపుకు ఆజ్ఞతవాసి లా పని చేసిన సుదీర్ కి భవిష్యత్తులో మంచి పదవులు రావాలని కొరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here