పుష్కరాల్లో చేసిన పాపాలు, తుని అరెస్ట్ లు కడిగేస్తాయా?

0
990

ఈ మద్యలో ఆంధ్ర సి.ఎం వ్యవహారం మరీ అతిగా మారిపోయింది. ఒకప్పుడు 9 ఏళ్ళు ఆంధ్ర ప్రదేశ్ ని మంచి పరిపాలకుడిగా పేరుగాంచిన చంద్ర బాబు నాయుడు ,రాష్ట్రం విడిపోయాక మాత్రం ఆ చార్మ్ ని కంటిన్యూ చేయలేకపోతున్నాడు. జగన్ విసూరుతున్న భాణాల మహిమో లేక పక్క రాష్ట్ర సి.ఎమ్ ,తన శిష్యుడు కెసిఆర్ తన కన్న బాగా పాలిస్తున్నాడని విషయం ఆయనకు నచ్చట్లేదో కాని ఆంధ్ర రాష్ట్రంలో వ్యతిరేకత మరీ ఎక్కువ పెరిగిపోయింది.

అసలు విషయానికొస్తే ఇపుడు ఆంధ్రలో బాబు కి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తన ఉద్యమాలతో నిద్ర లేకుండా చేస్తున్నాడు . కొన్ని నెలల ముందు తునిలో కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ భారీ బహిరంగ సమావేశం పెట్టాడు. కాని దురదృష్టవశాత్తు జనాలు బాగా రావటం వలన అక్కడున్న నిర్వాహకులు జనాలను కంట్రోల్ చేయలేకపోయారు.లోపల ఉన్న బాధను కొందరు ఆవేశంతో రైల్ ని దగ్దం చేసారు. ఐతే అపుడు ఆంద్ర సర్కార్ ఆందోళనకారులు కాపులు కారని అసలు గోదావరి జిల్లలో నుంచి వచ్చిన వారు కారని ,ఎక్కడో జగన్ జిల్లా నుంచి వచ్చిన రౌడీలు అని ఆ విషయాన్నీ జగన్ పైన తోయాలని ప్రయత్నిస్తూ ,ఒకవైపు ముద్రగడ పైన కూడా జగన్ రంగు పూస్తూ తన మార్కు రాజకీయాలను రాజేశాడు.
కాని తీరా చూస్తె ఇపుడు తుని ఘటన ని సంబంధించి గోదావరి జిల్లాల్లో కాపు ల అరెస్ట్ లు మొదలయ్యాయి. అపుడేమో రైలుని దగ్దం చేసింది గోదావరి ప్రజలు కాదని వేరే జిల్లాల వారని ప్రకటించిన బాబు ,ఇపుడు గోదావరి జనాలను అరెస్ట్ చేయటం అయన రెండు నాల్కల దోరణికి అడ్డం పడుతుంది.

అంతే కాకుండా తన పబ్లిసిటీ పిచ్చి వలన గోదావరి పుష్కరాల వలన పదుల సంఖ్యలో జనాలు చనిపోతే ఒక్కరిని అరెస్ట్ చేయించని బాబు (నిజానికి ఈ విషయంలో ఆయనే దోషి ) ,ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని చేపట్టిన ఆందోళనలో ప్రాణ నష్టం జరగలేదు. అలాంటిది దానిలో అమాయకులను అరెస్ట్ చేయటం బాబు రాజకీయనికి పరాకాష్ట. పరిస్తుతులు ఇలాగె కొనసాగిస్తే తెలంగాణా లో మూసుకుపోయిన ఒక కన్ను ,భవిష్యత్తులో తెదేపా కి రెండో కన్ను పోయి పార్టీకి చీకటి రోజులు వచ్చే ప్రమాదం ఉంది.

ఇప్పటికైనా ఆయన్ని అభిమానించిన జనాలకు మద్దతుగా నిలవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here