బాలయ్య నూరో సినిమాకు బాబు డైరెక్షన్

1
544

ఈ మద్య తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించి మీడియా కి హాట్ న్యూస్ ఏదైనా ఉందంటే చిరు 150 వ సినిమా ,బాలయ్య 100 వ సినిమా విశేషాలు. గత రెండేళ్లుగా ఈ సినిమాలకు దర్శకత్వం ఎవరు ?కథ ఏంటి ? నిర్మాత ఎవరు ?హీరోహిన్ ఎవరు ?కథ ఎవరిస్తున్నారు ?ఎప్పుడు విడుదల అవుతుంది అనే ప్రశ్నలకు ఎన్నో గాసిప్ వార్తలు రోజు ఎన్నో వస్తున్నాయి ,ఆన్లైన్ మీడియా కు మంచి సరుకు దొరుకుతుంది. చిరు సినిమా కు పూరి జగన్నాధ్ తర్వత ఇపుడు వినాయక్ కత్తి సినిమా తో లైం లైట్ లోకి వచ్చాడు. ఈ విషయంలో బాలయ్య కూడా తను తక్కువ తినలేదు అని ఎందరో దర్శకులను మార్చాడు. మొదట సింగీతం తో ఆదిత్య 369 కి సీక్వల్ అనుకున్నారు. కాని తర్వతా కృష్ణ వంశీ తో సినిమా ఉంటుందని అనుకున్నారు. కాని చివరకు క్రిష్ వద్ద బంతి ఆగింది. కాని బాలయ్య సినిమా కి మాత్రం తన బావ చంద్ర బాబు వేనుకుండి స్క్రిప్ట్ రాస్తున్నాడు .

మొదటి నుంచి తెదేపాకి సినిమా బలం ఎక్కువ ,ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు 80% జనాలు ఎన్టీఆర్ కి బాసట గా నిలిచాడు. తర్వాత బాలయ్య ,రోజా ,మురళీమోహన్ ,
కైకాల సత్యనారాయణ ,ఎవిఎస్ ,లాంటి వాళ్ళు తెదేపాకి సపోర్ట్ చేసారు. 2009 లో జూనియర్ ఎన్టీఆర్ తో బండి లాగించారు. కాని ఆ తర్వాత సీన్ మారింది. ఎన్టీఆర్ వీళ్ళకు దూరం కావటం వలన బాబుకి బయం పట్టుకుంది ఒక వైపు పవన్ కళ్యాణ్ కి అశేష జనాదరణ తో ముందుకు పోతున్నాడు ,దానికి తోడూ చిరంజీవి ,పవన్ కళ్యాణ్ లు కలిస్పోవటం ,వాళ్ళ కుటుంబంలో రామ్ చరణ్ ,బన్నీ ,సాయి ధరం తేజ ,వరుణ్ తేజ లాంటి యువ కథ నాయకులు ఉండటం వలన చంద్ర బాబు తన కుటుంబంలో నారా రోహిత్ లాంటి సినిమా వాళ్ళను ఎక్కువ ప్రాత్సహిసున్నారని ఒక వార్త. దీనికి తోడూ ఇన్నాళ్ళు బాలయ్య ఉన్నడని అనుకున్న కూడా చిరు ,పవన్ లాగా బాలయ్య కి ఇమేజ్ లేకపోవటం ,దానికి తోడూ ఈ మద్య బాలయ్య తన లూజ్ టాక్ తో ,తన బాడీ లాంగ్వేజ్ లతో ఉన్న పరువు తీసుకుంటున్నాడు అని భావిస్తున్నాడు. ఇక లాభం లేదని బాలయ్య ఇమేజ్ ని గాడిలో పెట్టె బాద్యత తన పైన వేసుకున్నాడని తెలుస్తుంది.

బాలయ్య నూరో సినిమా ని కూడా తను దగ్గరుండి చిరు 150 వ సినిమాకు తగ్గకుండా ఉండాలని చెప్పాడట. దానిలో భాగంగానే తన సామజిక వర్గం దర్శకుడు క్రిష్ ని దర్శకేంద్రుడు రాగవేంద్ర రావు తో సెట్ చేపించాడట,దానిని ఉగాదికి స్టార్ట్ చేస్తున్నారని వినికిడి. ఆ సినిమాకు జాతీయ స్తాయిలో బాహుబలి లాగా ప్రచారం చేయాలనీ కోరికతో ఇండియా టుడే వాళ్లతో బాలయ్య బాబు పైన ప్రత్యెక సంచిక విడుదల చేయించాడట. ఇప్ప్తటి వరకు చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు ల పైన స్పెషల్ సంచికలు వచ్చాయి. అవి కూడా చాల రోజుల క్రితం . సమరిసింహ రెడ్డి ,నరసింహ నాయుడు లాంటి పెద్ద సినిమాలు చేసి పీక్ లో ఉన్నపుడు కూడా బాలయ్య పైన స్పెషల్ ఎడిషన్ లు రానిది ,ఇపుడు ఎందుకు విడుదల చేస్తున్నారో అని చాల మందికి అర్థం కాకా తల గోక్కుంటే , మరి కొందరు మాత్రం అది చంద్ర బాబు దర్శకత్వం లో రాబోతున్న సినిమా అని చెవులు కోరుకుంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here