కన్నడలో బాహుబలి – 2 కి లైన్ క్లియర్

0
322
Baahubali - 2 ready to release in karnataka
Baahubali - 2 ready to release in karnataka

కన్నడ ప్రజలు చేసిన ఆందోళనలకు దిగొచ్చిన కట్టప్ప (సత్యరాజ్) క్షమాపణలు చెప్పడంతో ఇప్పుడు అక్కడ బాహుబలి – 2 సినిమా విడుదల కి లైన్ క్లియర్ అయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల విడుదలకి సిద్దం అయిన బాహుబలి – 2 కర్ణాటకలో కూడ విడుదలవుతుంది. కన్నడ ప్రజలు తనపై ఉన్న కోపాన్ని ఈ సినిమా పై చూపెట్టడం సరి కాదని, 9 సంవత్సరాల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకి క్షమాపణలు చెపుతున్నట్లు సత్య రాజ్ ప్రకటించాడు. దానికి కన్నడ ప్రజా సంఘాలు బాహుబలి – 2 విడుదలకి ఓకే చెబుతున్నట్లు స్పష్టం చేశాయి . దీనితో బాహుబలి నిర్మాతలకి , డిస్ట్ర్రిబ్యూటర్స్ కి ఉపశమనం దొరికినట్లైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here