ఊహించని ట్విస్ట్ తో బాహుబలి -3

0
1736
Baahubali-3 making with new twist
Baahubali-3 making with new twist
  ప్రపంచ సిని చరిత్రలో తెలుగు వైభవాన్ని సిని అభిమానులకి రుచి చూపెట్టిన మన తెలుగు సినిమా బాహూబలి – 2. హాలివుడ్ సినిమాలని తలదన్నే రీతిలో కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. కొత్త కొత్త రికార్డ్స్ ని తన వశం చేసుకుంటుంది.
  అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది.
  అయితే బాహుబలి- 2 సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి మనస్సులో కదిలే ఒక ఆలోచన బాహుబలి -3 కూడ ఉంటుందా? ఉంటే సినిమా ఎవరితో తీస్తారు. ఎప్పుడు తీస్తారు. దానికి సంభందించిన వివరాలు సినిమా దర్శకుడు ఎప్పుడు ప్రకటిస్తాడు. అసలు సినిమా ఉంటుందా? లేదా? అనే సందేహాలపై ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడేసుకుంటున్నారు. కాని ఈ మధ్య ఒక స్టోరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
  బాహుబలి-2 లో బల్లాల దేవుడిని చంపింన అమరేంద్ర బాహు బలి అవంతికను వివాహం చేసుకున్నాడా? లేదా?.
  దర్శకుడు ఎందుకు అంతటితో సినిమాని ముగించేసాడు. బల్లాల దేవుడి భార్య ఎవరు? ఆమె బతికే ఉందా? లేక మరణించిందా? ఇలాంటి అనేక సందేహాలకి సమాధానమే ఈ మా ఊహత్మక వివరణ.

  బల్లాల దేవుడి మరణాంతరం మాహిష్మతి సామాజ్యాన్నికి మహరాజు గా దేవసేన సమక్షంలో మహేంద్ర బాహుబలితో పట్టాభిషేకం జరిగింది. అలాగే ఒక శుభ ముహుర్తానా మహేంద్ర బాహుబలికి అవంతికతో వివాహాం జరిపించాలని నిశ్చయించుకుంది దేవసేన. వారి వివాహాం రాజ్య ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించింది.

  మహారాజుగా మహేంద్ర బాహుబలి తన సామ్రాజ్యాన్ని అజేయంగా పాలిస్తున్న సమయంలో అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. బల్లాల దేవుడి భార్య మాహిష్మతి సామాజ్యంలో అడుగు పెట్టడం , దేవ సేన – అవంతికల మధ్య బేధాభిప్రాయాలు రావడం ఇలా అనేక సమస్యల తో మహేంద్ర బాహుబలి రాజ్య పరిపాలనపై దృష్టి పెట్టకపోవడంతో మాహిష్మతి సామాజ్యంలో అశాంతి నెలకొంది. అదే సమయంలో మహేంద్ర బాహుబలి కి ఒక తియ్యని కబురు మాహిష్మతి సామాజ్యాన్నికి వారసుడు రాబోతున్నాడని. ఈ శుభ సమయం లో మాహిష్మతి సామాజ్యంలో పండగ వాతావరణం ఏర్పడింది.

  ఈ సమయంలోనే చరిత్ర మళ్ళి పునఃరావృతం అయ్యింది. దేవ సేన – అవంతికల మధ్య విభేదాలు ఎక్కువైపోయాయి. మహారాజు గా మహేంద్ర బాహుబలి ఏమి చెయ్యలేని పరిస్థితి. వీరి మధ్యలో బల్లాలుడి భార్య పాచీకలు కూడ తోడయ్యాయి.

  అవంతిక – మహేంద్ర బాహుబలి కి పుత్రుడు జన్మించాడు. మాహిష్మతి సామాజ్య ప్రజల సమక్షంలో దేవసేన అతనికి నరేంద్ర భాహుబలిగా నామకరం చేసింది. ప్రజలలో ఆనందం ఆకాశనంటింది. సమయం కోసం ఎదురుచూస్తున్న బల్లాలుడి భార్యకి అదును దొరికింది. ప్రజలలో మహరాజు పై అపనమ్మకాన్ని ఏర్పరిచింది. రాజ్య వినాశనానికి పావులు కదిపింది. దేవసేన అవంతికలు ఈ ఆటలో కీలు బొమ్మలుగా మారిపోయారు. కుటుంబ కలహాలు మహ రాజు మహేంద్ర బాహుబలిని మరణానికి కారణమయ్యారు.

  చరిత్ర పునఃరావృతం అయ్యింది. మహిష్మతి సామ్రాజ్యం ఒంటరిది ఐపోయింది. ప్రజలలో అశాంతి పెరిగిపొయింది. అక్రమాలు , దోపిడి దొంగల బీభత్సం పెరిగిపోయింది.

  మహిష్మతి సామ్రాజ్యానికి(భారత దేశానికి) నరేంద్ర బాహుబలి రాజు గా ప్రమాణ స్వీకారం చేసాడు. అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నాడు. తన పూర్వీకులు తన తండ్రి మరణాలకు కారణాలను తెలుసుకొని జీవితంలో వివాహాం అనే విషయానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. ప్రజల యోగ క్షేమాలపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు మహిష్మతి సామ్రాజ్యాన్ని (భారత దేశాన్ని ) విజయవంతంగా పరిపాలిస్తూ ప్రజల క్షేమానికి శ్రమిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here