వరంగల్ లోని తార గార్డెన్ లో తెలంగాణ జ్వాల,మున్నూరు కాపు మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ అవార్డ్ ఫంక్షన్ లో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఉపాధ్యక్షుడు ,బాచుపల్లి మండల సర్వేయర్ ఆర్మూర్ శ్రావణ్ కి సేవా రంగంలో అవార్డ్ వరించింది.ఈ పురస్కారాన్ని వరంగల్ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ అందించటం జరిగింది. ప్రభుత్వ సేవ రంగంలో,వ్యవసాయ సేవ రంగంలో ఎనలేని సేవలు అందిస్తున్న శ్రవణ్ కి ఈ అవార్డ్ వరించందని నిర్వాహకులు కోలా జనార్దన్ చెప్పారు.
అవార్డ్ గ్రహీత శ్రవణ్ మాట్లాడుతూ ఈ అవార్డ్ వల్ల మరింత భాధ్యత పెరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్
దాస్యం విజయభాస్కర్ , రాష్ట్ర బీజేపీ నాయకులు సోమారపు అరుణ్ కుమార్,తెలంగాణ జ్వాల ఎడిటర్ కుల్లా విజయ్,కోలా జనార్దన్,సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ శ్రావణ్, సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు రామన్ పాల్గొన్నారు.