నవ గాంధేయవాదానికి నాంది పలుకుతున్న ఆర్మూర్ గాంధీ

0
4807
భారతదేశ చరిత్ర తీసుకుంటే ఇద్దరి ప్రముఖుల గురుంచి ప్రస్తావన లేకుండా  మన చరిత్ర పూర్తి కాదు. వారు ఒకరు మహాత్మా గాంధీ ఐతే మరొకరు అబుల్ కలాం ఆజాద్. తన అహింసాత్మకమైన పంథాలో స్వతంత్ర ఉద్యమం నడిపి 200ఏళ్ల  భారత కలల్ని నెరవేర్చాడు.  అబుల్ కలాం ఆజాద్  ఐతే ఒకవైపు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ, వెనకపడ్డ ముస్లింలను తన మేధస్సుతో తట్టి లేపుతూ  ఉర్దూ సాహిత్యాన్ని అందించాడు. భారతదేశం ఒకటిగా ఉండాలని,పాకిస్తాన్ దేశం భారత్ నుంచి విడిపోవటం చారిత్రాత్మక తప్పిదం అని గట్టి వాదించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ కి సపోర్ట్ కి నిలిచిన న్యాయవాదులు ,ముస్లిం లీగ్ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నా కూడా తన భారతీయతని చాటిచెప్పాడు. మనుషులను మతాలవారీగా వేరు చేయకుండా భారతీయులుగా చూస్తూ  దేశానికి మొట్టమొదటి విద్య శాఖ మంత్రి అయ్యాడు ,తర్వాత దేశానికి మతాలకు అతీతంగా చాలా సేవలు చేశాడు.
ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాదు జిల్లాలో ఆర్మూర్ పట్టణంలో ఒక మధ్యతరగతి కి చెందిన ఒక ఆటో డ్రైవర్ ,మౌలానా  ఆలోచనలను ,గాంధీజీ పంథాలో ఆచరించి మానవసేవయే మానవ సేవ అనే గాంధీ సిద్ధాంతాలను పక్కాగా అమలు చేస్తున్నాడు. నవ గాంధేయవాదానికి  నాంది పలుకుతున్న ఆర్మూర్  గాంధీ.అయన పేరు  అబుల్ హుస్సేన్. ఆర్మూర్ గాంధీ అని పేరు చెపితే చాలు ఆ పట్టణంలో  ప్రతి ఒక్కరిలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. ఆ పెద్ద మనిషికి ఆ చిరునవ్వు తప్ప ఏమి ఇచ్చుకోలేరు ఎందుకంటే అయన ఏమిచ్చినా  తీసుకోడు కాబట్టి. తన ఆటో మీద వృద్దులకు ,గర్భిణులకు ,వికలాంగులకు ఉచితంగా తన ఆటోలో ఎక్కించుకొని తమ గమ్యస్థానానికి చేర్చుతాడు.
అయన ఆటో కి కావాల్సిన ఇంధనం డీజిల్ కాబట్టి డీజిల్ ని ఆటో లో  స్టాక్ పెట్టుకోవాలి. కానీ విచిత్రంగా అయన ఆటో లో 5 లీటర్ల పెట్రోల్ నిలువ ఉంటుంది ఎందుకో తెలుసా  ఎవరికైనా బైక్లో గాని స్కూటర్ లో గాని పెట్రోల్ అయిపోతే తన దగ్గర ఉన్న పెట్రోల్ ఇచ్చి వాళ్ల వాహనాలు ముందుకువెళ్లేలా సహాయం చేస్తాడు. ఇలాంటి సేవలు అయన ఖాతాలో ఎన్నో ఉంటాయి చాల వరకు గుప్త సేవలుగానే మిగిలిపోతాయి. అయన చేసిన సేవలను ఒకసారి క్షున్నంగా పరిశీలిద్దాం.
 • ఈ ఏడాది వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తో బాద పడ్తున్న తన స్వంత కాలనీ సైదాబాద్ కాలనీ లో 24 గంటల ఉచిత నీటి సరఫరా చేసి సేవకు పదవులు అవసరంలేదని నిరుపించాడు.
 • వేసవిలో అయన ఆటో లో ఒక డ్రమ్ ని పెట్టి ప్రయాణికులకు నీటి అందించి అందరి దాహం తీర్చాడు.
 • దారిలో ఎవరైనా వృద్దులు లేదా యాచకులు కనిపిస్తే వాళ్లకు తన దగ్గర ఉన్న భోజనాన్ని వాళ్లకు అందించి తన ఆటో ఎక్కించుకొని తమ గమ్యాన్ని చేరుస్తాడు.
 • ఎవరైనా రోడ్ మీద కూలి పనిచేస్తుంటే వాళ్లకు సహాయం చేస్తాడు.
 • మాములుగా ఒక ఆటో వెనుక రజిని కాంత్ ఫోటోనో లేక పవన్ కళ్యాణ్ ఫోటో నో లేక సల్మాన్ ఖాన్ ఫోటోనో ఉంటుంది కానీ ఈయన ఆటో వెనుక సమాజానికి ఉపయోగపడే సందేశాలున్న బ్యానర్ పెట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తాడు. అది కూడా సందర్భాన్ని తెలియచేసేలా ఉంటుంది ఉదాహరణకు ఎన్నికల సమయంలో ఓట్ హక్కునిసరిగా వినియోగించుకోవాలని ఉంటుంది . హరిత హరం సమయంలో దానికి అనుగుణంగా ఉంటుంది.
 • ఎవరైనా అనాధ శవాలు కనపడిన వాళ్ళ దహన సంస్కరణలు దగ్గరుండి నిర్వహిస్తాడు.
 • అయన కొచ్చే సరిసరిపడని ఆదాయంతో కూడా రోజు నల్గురు యాచకులకు ఇంటి దగ్గర భోజనం పెట్టిస్తాడు .
 • ఏ భారతీయ పండగ వచ్చిన కూడా గుళ్లో నో లేక మజిద్లోనో లేక చర్చి దగ్గర కి వెళ్లి పేద వాళ్లకు బట్టలు కొనిస్తాడు.
 • పేద విద్యార్థులకు చదువులో ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళ చదువుని కొనసాగించేలా పాటు పడతాడు.
 • ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన స్వచంద గ్యాస్ సబ్సిడీ విరమణ ని సపోర్ట్ చేస్తూ తన గ్యాస్ సబ్సిడీ ని వదిలేసి అందరికి ఆదర్శంగా నిలవటమే కాకుండా జిల్లా కలెక్టర్ తో ప్రశంసలు పొందాడు.
 • రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ ని కూడా వాపస్ ఇచ్చి తన ఉదారత ని చాటాడు.

సమాజ సేవ చేయటానికి ఆయనకు స్ఫూర్తి ఎవరని అడిగితే తన బాల్యం నుంచి గాంధీజీ జీవితం గురుంచి ,గౌతమ బుద్దుడి గురుంచి బాగా చదివి వాళ్ళ లాగా గొప్ప వాణ్ణి అవ్వాలనుకున్నాడని,వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఎలా అయ్యారని ఆరా తీస్తే వాళ్ళు చేసిన గొప్ప పనులు ,సమాజ సేవ వలనే ఆ పేరు వచ్చిందని ,హుస్సేన్ కూడా జీవితాంతం సమాజసేవకు కట్టుబడి ఉన్నానని చెప్పాడు. సమాజ సేవ అంటే మానవ సేవ ఒకటే కాదని భూమ్మీద ఉన్న సకల జీవులను కాపాడాలని సూచించాడు. తాను ప్రొద్దున లేవగానే పావురాలకు ,పిట్టలకు ఆహారంగా గింజలను వేస్తానని చెప్పాడు. చెట్లకు పెడుతూ ప్రకృతి ని బాలన్స్ చేయటానికి నా వంతు ఉడతా సహాయం చేస్తానని చెప్పాడు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన హరితహారం కార్యక్రమం తనకు చాల నచ్చిందని చెప్పాడు. గత ఏడాది ఆర్మూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన చెట్టు ని కాపాడుతున్నాని చెప్పాడు.
75 ఏళ్ల కు కూడా 40 ఏళ్ల యువకుడిగా కనిపించే అయన ఆరోగ్య రహస్యాలను అడిగినపుడు అందరిని ప్రేమిస్తానని,ఎవ్వరిని ద్వేషించనని దాని వలన నా ఆలోచనలు చెడుగా ఉండవని కాబట్టి ఇలా ఆరోగ్యాంగా ఉన్నానని చెప్పాడు.
60s లోనే 10 వ తరగతి చదివిన హాసన్, ఆ రోజుల్లో తన దేహ దారుఢ్యం చూసి పోలీస్ ఉద్యోగం వచ్చిందని ,తాను కూడా ఉద్యోగం చేస్తే లంచానికి లొంగిపోయి,తన లక్ష్యానికి దూరం అవుడతడేమోనని ఉద్యోగం చేయలేదని చెప్పాడు. ఐతే ఇలా మంచి ఉద్యోగాలను వదిలేసి తను సమాజసేవ చేస్తుంటే తన కుటుంబం నుంచి వ్యతిరేకత రాలేదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ నిజానికి సమాజ సేవ చేయటం తన తో మొదలు కాలేదని తన తాత గారు ,నాన్న గారు సమాజ సేవకులని దానితో తనకు సమాజ సేవకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ,మరొక అదృష్ట విషయం ఏంటంటే తన భార్య ,కొడుకు కూడా సమాజ సేవ అంటే ఇష్టం ఉండటంతో తనకు అలాంటి కుటుంబం దొరకడంతో తన జన్మ ధాన్యం అయిందని చెప్పాడు.

గాంధేయవాదం అంటే కేవలం రాజకీయాల ప్రవేశం ముందు ప్రదర్చించే విన్యాసం అని యువతలో చెడు అభిప్రాయం ఉంది,అసలు గాంధేయవాదం హుస్సేన్ గారు చేసే పనులలో ఉందని నేటి యువత తెలుసుకోవాలని,అయన సేవలను భారత ప్రభుత్వం గుర్తించాలి కబుర్లు కోరుకుంటుంది. అంటే కాకుండా తన చిరకాల కోరికలైన ఆర్మూర్ లో పేద వాళ్లకు ఒక ఆశ్రమం పెట్టటం ,ప్రధాని మోడీ గారిని కలవటం జరగాలని కోరుకుందాం.

 

Authors: Ravinder Ryada and Malyala Narsa Reddy

Source:Malyala Narsa Reddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here