పసుపు రైతులకు బాసటగా నిలుస్తున్న ఆర్మూర్ ప్రాంత ఐటి ఉద్యోగులు

0
182

పసుపు అంటే పవిత్రంగా చూస్తారు.ఎందుకంటే పసుపు శాస్త్రీయంగా అంటి బయటిక్ గా పని చేస్తే ఆధ్యాత్మికంగా ఎంతో విలువ ఉంది. అదే విదంగా పసుపు పంటకు కూడా ఒకప్పుడు బాగా డిమాండ్ ఉండేది. దశబ్దం క్రీతం 17 వేల రూపాయలకు క్వింటాలు పల్కిన పసుపు గత 5 ఏళ్లుగా కేవలం 4-6 వేల మధ్య ఊగిసలాడుతూ కనీసం మద్దతు ధర లేక రైతులు కష్టాల పాలు అవుతున్నారు. ప్రధానంగా ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఆర్మూర్ ,బాల్కొండ ,నిజామాబాదు రూరల్ నియోజకవర్గాల్లో పసుపు పంటను ఇంటి పంటగా వేస్తారు. కనీసం అర ఎకరం అయిన కూడా పసుపు వేయకపోతే ఎదో కోల్పోయినట్లు భావిస్తారు. పంట కు ధర ఉన్నపుడు ఎంతో దర్జాగా బతికిన కుటుంబాలు ఇపుడు పసుపుకు ధర లేకపోయేసరికి మోహంలో ఎదో వెలతి తో కనిపిస్తున్నారు.

ఇదే విదంగా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన క్రాంతి కుమార్ తన తండ్రి కష్టపడి పసుపు పంట తో వచ్చిన డబ్బులతో తనను ఐఐటి చదువు చదివించి ఇంజనీర్ చేశాడు. కానీ తనకు జీవితాన్ని ఇచ్చిన పసుపు పంట కు మద్దతు ధర లేకపోవటంతో రైతులకు ఎదో ఒకటి చేయాలని ఆర్మూర్ ప్రాంత ఐటి ఉద్యోగులతో పాటు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ తో చేతులు కలిపి change.org అనే వెబ్ సైట్ లో ఆన్లైన్ సంతక సేకరణ చేస్తున్నాడు. దీనికి 3 రోజుల్లో దాదాపు 6 వేల మంది సంతకాలు చేయడంతో చాలా వైరల్ అయింది.

అయన మాట్లాడుతూ ” నా ఆలోచనకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడా గారు మంచి ఉత్సాహం ఇచ్చి ఆర్మూర్ లో ఉన్న విద్యావంతులకు లింక్ పంపించి అందరితో సంతకాలు చేయడంలో అయన టీం కీలక పాత్ర వహించింది. లక్ష సంతకాలు పూర్తవగానే రాష్ట్ర నాయకులను ,కేంద్ర నాయకులను కలిసి వినతి పత్రం అందచేద్దామని అనుకుంటున్నాం. ఈ విషయంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు.”

https://www.change.org/p/cmo-telangana-support-armoor-farmers-on-demanding-minimum-selling-price-for-turmeric-redjowar-crops

https://www.change.org/p/cmo-telangana-support-armoor-farmers-on-demanding-minimum-selling-price-for-turmeric-redjowar-crops

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here