ఆపిల్ కావాలా నాయన?

0
414

రక్త దానమిస్తే మంగో జ్యూస్ ,ఇంకా ఏదో ఫ్రూట్ జ్యూస్ ,కుదరకపోతే  frooty ,అది కుదరకపోతే GOOD  DAY  BISCUT ఇచ్చి ,దానమిచ్చిన వాళ్ళకి ఊరట నిచ్చి ప్రాణాలను కాపాడేవాళ్ళు . ఐతే ట్రెండ్ మారింది …. ఆపిల్ పండు బదులు ఆపిల్ ఐ ఫోన్ ఇస్తున్నారట చైనాలో కాని రక్తానికి  కాదు వీర్యానికి .
ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తాజాగా ఐఫోన్ నుంచి విడుదలైన 6ఎస్‌ కోసం టెక్నాలజీ ప్రియులు పోటీ పడుతున్నారు. ఐఫోన్ కోసం ఏకంగా ఇద్దరు చైనీయులు తమ కిడ్నీలను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించారు. తర్వాత బేరం బెడిసికొట్టడంతో వారు వెనక్కితగ్గారు. ఇక షాంఘైలో అయితే స్పెర్మ్ బ్యాంకులు మరో అడుగుముందుకేసి యువతకు గాలం వేసే పనిలో పడ్డాయి.వీర్యా దానం చేయండి..ఐ ఫోన్ పట్టుకెళ్లండి అంటూ ప్రచారం చేస్తు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఐ ఫోన్ 6ను దక్కించుకునేందుకు కిడ్నీలు అమ్మాల్సిన పనిలేదు. జస్ట్ వీర్యం దానం చేస్తే చాలు ఐఫోన్ మీసొంతమవుతుందన్న ప్రకటలు ఇచ్చాయి. అయితే, వీర్యం దానం చేయటానికి కొన్ని షరతులు వర్తిస్తాయని మెలికలు పెట్టాయి.
చైనా గుర్తింపు కార్డు, కాలేజీ డిగ్రీతో పాటు 165 సెంటీమీటర్ల ఎత్తు కలిగివుండాలని జన్యుపరమైన వ్యాధులు ఉండరాదని చెప్పాయి. 17 మిల్లీ లీటర్ల వీర్యం దానం చేస్తే రూ. 60 వేలు ఇస్తామని ప్రకటించాయి. ఒక్కరు ఎన్నిసార్లైనా దానం చేయవచ్చు. ఒకసారి దానం చేసిన తర్వాత 48 రోజుల గ్యాప్ తీసుకోవాలని నిబంధన పెట్టాయి. స్పెర్మ్ బ్యాంకులు చేస్తున్న ఈ ప్రకటనతో ఎంతమంది ముందుకు వస్తారో వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here