సివిల్స్ పరీక్షలో దుమ్ము లేపిన తెలంగాణ విద్యార్థులు

0
285

అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణాలో ఈ సారి సివిల్స్ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు దుమ్ము లేపారు. ఈ ఫలితాల్లో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలానికి చెందిన దురిశెట్టి అనుదీప్ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించారు. ఖమ్మంలోని జయనగర్‌కు చెందిన కోయ శ్రీహర్ష ఆరో ర్యాంకు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెంట్లవెల్లికి చెందిన గడ్డం మాధురి 144వ ర్యాంకు, కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సురభి సత్తయ్య కుమారుడు సురభి ఆదర్శ్ 393వ ర్యాంకు, మామునూరు ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎడవెల్లి దయాకర్ కుమారుడు ఎడవెల్లి అక్షయ్ 624 ర్యాంకు, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బల్ల అలేఖ్య 721వ ర్యాంకు, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషు 724వ ర్యాంకు సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here