అంతరిక్షం…కృషి,సంకల్పంతో కూడిన ప్రయోగాల వరుణ వృక్షం

0
203

నిన్న విడుదల అయిన అంతరిక్షం సినిమా క్లాస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది.తెలుగులో హాలీవుడ్ రేంజ్ లో తీసిన సినిమాల్లో మొదటి వరుసలో ఉంటుంది అనటంలో సందేహం లేదు.

కెరీర్ లో ప్రతి సినిమాను విభిన్నంగా ఎంచుకుంటున్న వరుణ్ ఇపుడు కూడా ఎవరు చేయని సాహసం చేసి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.స్పేస్ సైంటిస్ట్ పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా ఆ పాత్ర తాలూకు ఆహర్యాన్ని, పాత్రలో ఉన్న భావోద్వేగాలను ప్రేక్షకులకు చూయించటంలో సక్సెస్ అయ్యాడు.వ్యక్తిగత జీవితాన్ని ప్రొఫెషినల్ జీవితాన్ని బ్యాలన్స్ చేయటంలో ఏలాంటి వేదనకు గురి అయ్యాడో ఎలాంటి సంఘర్షణకు లోను అయ్యాడో చూయిస్తూ పాత్రలో బాగా జీవించాడు.

దర్శకుడు సంకల్ప్ రెడ్డి విషయానికొస్తే మొదటి సినిమా ఘాజి తో సముద్రంలో మొదలుపెట్టి,ఇపుడు ఆకాశంలో తన సత్తాను చాటి భూమ్మీద తెలుగు సినిమాను ప్రతిష్టను నిలపడంలో కృషి చేశాడు.ప్రధానంగా తెలుగు సినిమా అంటే పాటలు,ఫైట్స్ మాత్రమే కాదు సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కథలతో స్టార్ హీరోలతో సినిమాలు తీసి హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయొచ్చు అని నిరూపించాడు.ప్రతి ఒక్క పాత్ర కూడా కథ పరిధి కి మించకుండా తయారుచేయగలిగాడు.స్పేస్ రాకెట్ లో ఉన్న టెక్నికల్ విషయాలను ప్రేక్షకులకు అర్థం చేసే విధానంలో సఫలం అయ్యాడు.మొదటి భాగంలో కొంచెం బోరింగ్ అనిపించినా కూడా అది కథకు అనుగుణంగా వెళ్లడంతో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి.ప్రధానంగా సినిమా రాకెట్ సైన్స్ సబ్జెక్ట్ అయిన కూడా తెలుగు నేటివిటీ కి సంబంధించిన కుటుంబ విలువలు,కామెడీ మాత్రం ఎక్కడ కూడా వదులుకోలేదు.

ప్రధానంగా మాటలు బాగున్నాయి.హీరోహిన్ హీరోను ముద్దు పెట్టుకొని రాకెట్ ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్నట్లు ఉంది అనే డైలాగ్ ,హీరో స్పేస్ ఆపరేషన్ గురుంచి చెబుతూ “ఇది ఒకరి కూతురికి మొదటి కోరిక..ఒకరి కూతురికి ఆఖరి కోరిక” అని చెప్పడం,రాకెట్ లో ప్రయాణం చేస్తున్నపుడు హీరో రాకెట్ ని వేరే ప్రదేశానికి వెళ్దాం అని అన్నప్పుడు ఆయన సయోద్యోగి మాట్లాడుతూ “ఇది రాకేట్ అనుకున్నవా లేక షేర్ ఆటో అనుకున్నవా ఎప్పుడంటే అపుడు దిగిపోవడానికి” అనే డైలాగ్ ,మరో సందర్భంలో మరో సయోద్యోగి మాట్లాడుతున్నప్పుడు”చందమామ ను చూయిస్తే అన్నం తినేవాన్ని…కానీ ఇపుడు అక్కడికి వెళితే తిండి దొరకటం లేదని ” రాకెట్ లో ఉన్న ఆక్సీజన్ లెవెల్స్ గురుంచి చెప్పే డైలాగ్ …ఇలా ప్రతి సందర్భంలో కూడా సంకల్ప్ తన ప్రతిభను చాటాడు.పాటల విషయానికొస్తేశూన్య సాగరంలో పయనం అనే పదం కొత్తగా ఉంది.

ప్రదానంగా నిర్మాణ విలువలు ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి.రెండో భాగంలో ప్రేక్షకులు అంతరిక్షంలో ఉన్నామని ఫిల్ కావటంలో క్రిష్ బృందం సక్సెస్ అయ్యారు.ఈ సినిమాను 3డి లో తీస్తే ఇంకా బాగుండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here