రాజదాని వికేంద్రీకరణ విషయంలో జగన్ భేష్ కాని చిట్టి సలహా

0
28

వికేంద్రీకరణ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అందరికి ఆమోగ్యయోగంగా ఉంది.కానీ కింది విషయాలు సరిచేసుకుంటే ఇంకా బాగుంటుంది.

1 )అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్లు, హైకోర్టు అలాగే ఉంచి విశాఖ, కర్నూలులలో హైకోర్టు బెంచ్ లను ఏర్పాటు చేయాలి. తిరుపతి, విశాఖలను IT హబ్ లుగా అభివృద్ధి చేయాలి.

2) ఇండస్ట్రీలు ప్రకాశం జిల్లా, రాయలసీమలలో ఏర్పాటు చేయాలి.అంతేగానీ ఎక్కడో శ్రీకాకుళం జిల్లావారు హైకోర్టుకు మారుమూలనున్న కర్నూలు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది? హైకోర్టును కర్నూలులో మాత్రమే పెడితే శ్రీకాకుళం వాసులకు ఎంత ఖర్చు? హైకోర్టును కేవలం కర్నూలులో మాత్రమే పెడితే ఘోర తప్పిదమే.

3) రాయలసీమకు కర్నూలులో ఒక హైకోర్టు బెంచ్ ,ఉత్తరాంధ్రకు విశాఖలో ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. ప్రధాన హైకోర్టు 13 జిల్లాలకూ మధ్యలో ఉన్న అమరావతిలోనే ఉంచాలి.

4) అవసరమైతే విశాఖ, అమరావతి, తిరుపతిలలో మూడు అసెంబ్లీ భవనాలు కట్టి శీతాకాల సమావేశాలు అమరావతిలో, వేసవి సమావేశాలు విశాఖలో, వర్షాకాల సమావేశాలు తిరుపతిలో జరుపవచ్చు.

5) సెక్రటేరియట్ మాత్రం అమరావతిలోనే ఉంచాలి.

కర్ణాటకలో బెంగళూరుతోబాటు ఎక్కడో మారుమూల మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న బెల్గాంలో మరో అసెంబ్లీ కట్టి రెండవ రాజధానిగా ప్రకటించారు.హైకోర్టు బెంగళూరులోనే ఉంచి…. గుల్బర్గాలో ఒక హైకోర్టు బెంచ్ , ధార్వాడలలో మరో హైకోర్టు బెంచ్ కట్టారు.

కర్ణాటక తరహా విధానాన్ని అనుసరించాలి.

Source : అశ్విన్ పోతుల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here