వర్మ రాజ్యంలో కడప బిడ్డలు (ఓ సీనియర్ జర్నలిస్ట్ సినీ విశ్లేషణ)

0
143

నేను సినిమాలు చాలా అరుదుగా చూస్తాను. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రాజకీయ ప్రభావ ప్రాధాన్యం దృష్ట్యా ఈ రోజు మార్నింగ్ షో హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో చూశాను. జగన్ ను గొప్ప హీరోగా, బాబు సహా కమ్మ నేతల్ని విలన్లుగా, లోకేష్, పవన్ కళ్యాణ్ , కె ఏ పాల్ లను బుర్ర లేని జోకర్లు, బఫూన్లు గా చూపించాడు దర్శక తిక్కేంద్రుడు. చివరి లో వర్మ స్వయంగా ఓ సందేశమిచ్చాడు… “రాజకీయాలు, మీడియా అన్నీ ప్రజలకు కేవలం ఎంటర్ టెయిన్ మెంట్ మాత్రమే”నట.
Pro jagan, anti TDP, anti Janasena, anti BJP propaganda movie ఇది.

హత్యా రాజకీయాల దరిమిలా రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన అహింసావాది జగన్నాధ రెడ్డి 175 కు గతంలో గెలిచిన 151 సీట్ల బదులు ఈసారి 174 సీట్లు గెలవడంతో ఈ సినిమా ముగుస్తుంది. మిగిలిన ఒక్కసీటు “బాబు” గెలుస్తాడు. It’s a biased and twisted portrayal of political scenario.

గ్యాంగ్ రేప్ లకు లుంపెన్ యువతను ప్రేరేపించేలా చిత్రీకరించిన ఓ మసాలా ఐటమ్ సాంగ్ సినిమా బోర్ కొట్టి రషెస్ తగ్గకుండా కలెక్షన్స్ ను కాపాడే అదనపు ఊతకర్ర. వెరసి ఫక్తు ‘రాగోవ’ అతితెలివికి, perverted చాపల్యాలకు, అతని (వర్గం) ప్రస్తుత మానసికస్థితికి అద్దం పట్టిన చిత్రమిది.

ప్రధాన పాత్రల్లో నిజమైన నటులు అద్భుతంగా రక్తి కట్టించారు. చిల్లర పాత్రల్లో అక్కడక్కడా అరకొర మీడియా సెలిబ్రిటీలు ఇద్దరు, ముగ్గురు కనిపించి అసహ్యం తెప్పించారు. ఎక్కడ చూసినా ఈ సందట్లో సడేమియాలే. మన ఖర్మ. Neutral, objective plane లో critical political satire గా తీస్తే ఇది చక్కని ట్రెండ్ సెట్టర్ అయ్యేది.

కానీ తెర వెనుక ఏ శక్తులున్నాయో వాటి కుటిల ప్రయోజనాల పరిరక్షణలో భాగంగా, హాస్యం ముసుగులో కొన్ని వర్గాల్ని అపహాస్యం చేసింది. జనం వెర్రిబాగులనీ, ఓ వర్గం విలన్లే నేటి హీరోలనీ చాటింది.

Source : Mahanthy VenkataRao,famous political analyst (copied from his Fb wall)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here