తన మామయ్య మెండు సత్యనారాయణ గారికి తన సెంచురి ని అంకితం ఇచ్చిన అంబటి

0
303

మాములుగా క్రికెటర్లకు భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి పైకి సెలెబ్రిటీలు గా ఉన్నా కూడా సమయం వచ్చినపుడు తమలోని మానవ ప్రేమలు,సంబంధాలను బయటకి చూపిస్తారు. ఒకప్పుడు సచిన్ ,గంగూలీ లు తాము సాధించిన విజయాలను తమకిష్టమైన వాళ్లకు అంకితం ఇస్తుంటారు.ఇపుడు సచిన్ కి ఇష్టమైన ప్లేయర్ మన తెలుగు వాడైన అంబటి తిరుపతి రాయుడు తాను సాధించిన సెంచరీ తన మామయ్య కి అంకితం ఇచ్చాడు.
ఇటివల మృతి చెందిన మెండు సత్యనారాయణ గారికి తన సెంచరీని అంకితం చేస్తున్నాట్టు రాయుడు ప్రకటించాడు.
ఇటివల హైదరాబాదులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ గారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సూపర్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు(100నాటౌట్: 62 బంతుల్లో 7ఫోర్లు,7సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. 180 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాయుడు ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు.                                    ఏదీ ఏమైనా ఎప్పుడు తన ఆటలో ఆవేశాన్ని చూయించే రాయుడు ఇపుడు తన విజయాన్ని తన మామయ్య కి అంకితం ఇవ్వటంతో అందరి అభిమానాన్ని చురగొనటం విశేషం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here