బంపర్ ఆఫర్లతో అమెజాన్ ఫ్రైమ్ డే సేల్స్…

0
338
Amazon Prime Day Sales
Amazon Prime Day Sales

ఆన్ లైన్ రీటైలర్ అమెజాన్ ఫ్రైమ్ డే సేల్ పేరుతో సేల్స్ ను మరింత పెంచుకునేందుకు ఇండియాలో భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఈ సేల్‌ సోమవారం (జులై10) సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్‌పై కూడా భారీ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా టీవీ కొనుగోలు చేసిన ప్రైమ్‌ ఖాతాదారులకు మరో టీవీని ఉచితంగా అందించనుంది. ఈ సేల్‌ లో 20 టాప్ బ్రాండ్లతోపాటు అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందించనున్నామని అ మెజాన్‌ ప్రైమ్‌ హెడ్‌ అక్షయ్‌ సాహీ తెలిపారు. ఫస్ట్ టైం భారత్ లో ప్రైమ్ డే సేల్స్ ప్రారంభిస్తున్న సందర్భంగా డిస్కౌంట్స్, ఆఫర్స్, క్యాష్ బ్యాక్ లు భారీగా ఉండొచ్చని వినియోగదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రైమ్ మెంబర్ షిఫ్ ఉన్నవారికే ఎంట్రీ. ప్రైమ్ మెంబర్ షిఫ్ లేనివారు 499 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here