సంపాద‌న‌ను దానం చేయాల‌నుకుంటున్న అమెజాన్‌ సీఈవో

0
312
amazon-founder-ceo-jeff-bezos-like-to-donate-millions-of-rupees
amazon-founder-ceo-jeff-bezos-like-to-donate-millions-of-rupees
    అమెజాన్ సీఈవో జెఫ్ బీజోస్ త‌న సంపాద‌న‌ను దానం చేయాల‌నుకుంటున్నాననీ దీనికి ఫాలోవర్స్ ఐడియాలు కావాలంటూ ట్విట్టర్ లో ట్వీట్‌ చేశారు. కోట్లాది రూపాయాల‌ను విరాళం ఇవ్వాల‌నుకుంటున్నానని సలహాలివ్వాంటూ ట్వీట్‌లో కోరారు. ఆయ‌న ట్వీట్ చేసిన కొన్ని గంట‌ల్లోనే వేల కొద్ది లైక్స్,వేల కొద్ది రీట్వీట్లతో ఈ ట్వీట్ సంచలనం సృష్టించింది. తన సొమ్ములో ఎక్కువ శాతం దానాలకే వినియోగిస్తానని కానీ ఇంకా ఎక్కువ శాతం దానం చేయాలని కోరికగా ఉందని ప్రజలకు సహాయం చేయాలని అనుకుంటున్నానని దీనికి ఐడియాలు కావాలని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. అంతేకకుండా ఆయన ఇలా ప్రకటించటం తప్పనిపిస్తే ఆ విషయాన్ని కూడా తనకు తెలియజేయాలని కోరారు.

    జెఫ్ బేజోస్ మొత్తం ఆస్తి సుమారు 76 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉంది. ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ బెజోస్ కుటుంబం ఇటీవల 35 మిలియన్ డాలర్లను విరాళాన్ని అందించింది.41 సంవత్సరాల తమ సేవల్లో ఇదే అతిపెద్ద సింగిల్ విరాళమని తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here