కమల దళపతి బండి సంజయ్ చొరవతో ఆలేరు రైతుకు ధాన్యం కొనుగోలు విషయంలో జరిగిన న్యాయం

57 0

పుల్లయ్య గూడెం, ఆత్మకూరు మండలం, ఆలేరు అసెంబ్లీ, భువనగిరి-యాదాద్రి జిల్లాకు చెందిన పేద యువ రైతు బిడ్డ మల్లి మహేందర్ రెడ్డి బోడుప్పల్ చెంగిచెర్లలో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న అతను నాకు (మూడెత్తుల మల్లేష్ యాదవ్) ఫోన్ చేసి, తన తండ్రి మల్లి నర్సి రెడ్డి తాము పండించిన వరి ధాన్యం ఆలేరు రైస్ మిల్లర్లకు అమ్మడానికి పోతే, ధాన్యం తడిగా ఉందని, గింజ ఎమ్ ఎమ్ సైజు తక్కువగా ఉందని ఏవేవో సాకులు, ఆంక్షలు పెట్టి మా ధాన్యం కొనుగోలు చెయ్యకుండా అడ్డువేశారని తన గోడు చెప్పి తనకు న్యాయం జరిగేలా చూడమని వేడుకున్నాడు. నేను, ఆలేరు బీజేపీ మండల అధ్యక్షుడు, అసెంబ్లీ కో కన్వీనర్, బీజేపీ సీనియర్ నాయకురాలు బండారు శోభారాణి గార్లతో వివరంగా మాట్లాడి విషయం తెలుసుకుని వెంటనే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ఆలేరు రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న అన్యాయం వివరించగా, వెంటనే ఆలేరు చిత్తాపురం బాలాజీ రైస్ మిల్స్ యజమానితో మాట్లాడి, ఏవేవో కుంటి సాకులు చెప్పి పేద రైతులకు అన్యాయం చేయ్యవద్దని హితబోధ చేసి రైతు మల్లి నర్సిరెడ్డి పండించిన ధాన్యం న్యాయబద్ధంగా ప్రభుత్వం తీసుకొనేలా చేసిన రైతుబంధు బండి సంజయ్ అన్నకు, నాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పి, ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మల్లి నర్సి రెడ్డి నాకు చెప్పారు. ఈ విషయంలో భజపా ఆలేరు మండల అధ్యక్షులు మల్లా రెడ్డి, జిల్లా యువ మోర్చా కార్యదర్శి వయ్యల కుమార స్వామి, రామలింగయ్య యాదవ్, కన్వీనర్ గజరాజు కాశినాథ్, వేన నర్సీ రెడ్డి తదితర భజపా నాయకుల కృషితో మన కమల దళపతి చొరవతో ఒక పేద రైతుకు న్యాయం చేశామని భజపా రాష్ట్ర యువ నాయకులు మూడెత్తుల మల్లేష్ యాదవ్ తెలియచేశారు.

Related Post

కరోన కాలంలో రైతుల కష్టాలను తీర్చినందుకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ కి అవార్డు

Heavens homes society ఆధ్వర్యంలో ఈ రోజు రవీంద్ర భారతిలో నిర్వహించిన సేవ భారతి అవార్డు ఉత్సవాల్లో గత ఏడాది కరోన కష్ట కాలంలో మన సంస్థ…

ఇళ్లల్లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన వారికి మనం ఫౌండేషన్ చేయుత

Posted by - May 5, 2020 0
మోతీనగర్ ప్రాంతంలోని హామాలి బస్తీలో నివసిస్తు, ఇళ్ళల్లో పని చేస్తూ ప్రస్తుత పరిస్థితులలో చేతిలో పని లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి, అలాగే దినసరి కూలీలకు…

హాసకొత్తూర్ లో ఇంటింటికి ఒక మాస్క్ పంచిన ప్రవాస భారతీయుడు

Posted by - April 16, 2020 0
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన ప్రముఖ ప్రవాస భారతీయుడు నవీన్ కుమార్  ఇంటికి ఒకటి చొప్పున 1200 మస్కులను గ్రామ సర్పంచ్ పద్మ…

సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ సిబ్బంది కి శానిటైజర్లు పంచిన TConnects డైరెక్టర్ ఆర్మూర్ సంతోష్

Posted by - April 13, 2020 0
కరోనా ఎఫెక్ట్ లో పగలు రాత్రి తిండి తిప్పలు మానేసి ప్రజలకు రక్షణగా ఉంటున్న పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా Save Global farmers…

నగర పోలీసులకు పదివేల బిస్కెట్ ప్యాకెట్లు అందజేసిన కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి

Posted by - May 5, 2020 0
కరోనా వేళ నగర పోలీసుల అవిశ్రాంత సేవలు నిరూపమానమని సైదాబాద్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి అభినందించారు. మంగళవారం నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం అడిషనల్ కమిషనర్ అనిల్…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *