జాతీయ యువజన అవార్డును అందుకున్న తెలంగాణ ఉద్యమకారుడు

0
57

13-10-2019
ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఏపీ ఆంధ్రప్రదేశ్ భవనం లో ఉన్న అంబేద్కర్ ఆడిటోరియంలో అంతర్జాతీయ యువజన సదస్సు మరియు జాతీయ అవార్డులు 2019 కార్యక్రమం
ఇంటర్నేషనల్ యూత్ సొసైటీ నేషనల్ యూత్ అవార్డ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది
ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు రాష్టీయ గౌరవ సమ్మాన్ అవార్డు అందుకున్న ఆకుల స్వామి వివేక్ పటేల్
మహాత్మగాంధీ 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ రంగాలలో ఉత్తమ సేవలందించిన సామాజిక సేవా కార్యకర్తలకు అంతర్జాతీయ యువజన సమాఖ్య మరియు జాతీయ యువజన సంఘాల సమాఖ్య రాష్టీయ గౌరవ్ సమ్మాన్ అవార్డును ప్రముఖ గాంధేయవాదీ, జాతీయ యువజన సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ నండూరి సుబ్బారావు మరియు ఆధ్యాత్మిక బౌద్ధ మత గురువు గురు కర్మ తన్పాయ్ , మిస్ ఇండియా షేఫాలి సౌధా గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగాస్వామి వివేక్ పటేల్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసిన డాక్టర్ జావీద్ జమేదార్, డాక్టర్ మనీష్ శంకర్ గవాయ్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవార్డు తనలో సామాజిక బాధ్యతను మరింత పెంచిందని యువకుల యొక్క నైపుణ్య అభివృద్ధి కొరకు , ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తానని,ప్రతి ఒక్కరిని చైతన్యం చేసేందుకు కృషి చేస్తానని తెలిపి, తనకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here