ఆకుల కొండూరు గ్రామంలో ఆగ్రోస్ సీడ్స్ వారి రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక, ధర్పల్లి జెడ్పిటిసి సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్ మోహన్ గారు

291 0

నిజామాబాద్ మండల కేంద్రంలోని ఆకుల కొండూరు గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ వారికి వ్యవసాయ రంగంలో పంటను రక్షించుకునే విధంగా  ఆగ్రోస్ సీడ్స్ వారి రైతు సేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యవస్థాపించినది..
ఈరోజు ఆకుల కొండూరు గ్రామంలో *ఆగ్రోస్ సీడ్స్ వారి రైతు సేవా కేంద్రాన్ని గౌరవ నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక, ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్ మోహన్ గారు ప్రారంభించారు..*
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఆగ్రోస్ సీడ్స్ యజమాని గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు..
గ్రామంలోని రైతులకు వ్యవసాయ రంగంలో పంటను కాపాడే రసాయనాల మందులను అందించాలని, రైతులందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు..
రైతు సేవ కేంద్రం దినదిన అభివృద్ధి చెందాలని గౌరవ జడ్పిటిసి సభ్యులు ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, స్థానిక ఎంపీపీ అనూష ప్రేమ్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, మండల పార్టీ అధ్యక్షులు సంతోష్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గంగారెడ్డి, ఎంపీటీసీ నాశెట్టి సుధీర్, సొసైటీ చైర్మన్ లు మరియు డైరెక్టర్లు శ్రీనివాస్, నరసయ్య, కిరణ్ కుమార్, లింగం, అనిల్, టీఎన్జీవోస్ యూనియన్ సుమన్, పాల్గొన్నారు..

Related Post

రేవంత్ కి పీసీసీ ఇస్తే కేసీఆర్ కె లాభం..ఎందుకో చూడండి….

రేవంత్ రెడ్డి కేసీఆర్ ల మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గు మంటుంది అనేది అక్షరసత్యం.ఒకానొక సమయంలో తెలంగాణ లో రేవంతా కేసీఆరా అనే విదంగా యుద్ధం…

కరోనా సంక్షోభం వల్ల ప్రజల ఆకలి తీరుస్తున్న ధాతలకు అభినందనలు

Posted by - April 14, 2020 0
  దేశ/రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడం జరిగిందని,తెలంగాణ రాష్ట్ర కరోనా వైరస్ మహమ్మరిని అరికంటెందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు…

ఎమ్మెల్యే వివేక్ పుట్టిన రోజు సందర్భంగా వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేత

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్  పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు బదులుగా పేదలకు సేవా కార్యక్రమాలు చేయాలనే పిలుపుతో ఈరోజు 129 సూరారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…

నష్టపోయిన రైతులను ఆదుకోవావలి ప్రజాసంఘాల నాయకులు డిమాండ్

  షాద్‌నగర్ నియోజకవర్గం :జిల్లేడు చౌదరిగూడెం: పంట నీట మునిగి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు…

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ఆవిష్కరణ

ఈ కార్యక్రమంలో బాల్కొండ అసెంబ్లీ ఇంచార్జీ రుయ్యాడి రాజేశ్వర్ , జిల్లా కార్యదర్శి నాగులపల్లి రాజేశ్వర్, bjym రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్, బీజేపీ సీనియర్ నాయకులు ద్యగ…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *