పేరు తోకలను సరిగ్గా వాడుకున్న అడ్డాల

0
1648

దర్శకుడు క్రిష్ కంచె సినిమాలో కులాల ప్రస్తావన బాగా చేసాడు. వృత్తుల ఆదారంగా కులాలు పుట్టాయని ఒక డైలాగ్ ద్వారా బాగా చెప్పాడు. ఇపుడు కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కులం పేరు తో వచ్చే తోక పేర్లను బ్రహ్మోత్సవం సినిమాలో బాగా వాడుకున్నాడు. నాయుడోల్ల ఇంటికాడ పాటలో జానపద భాణిలో కులం పేరుతొ ఉండే తొకలను పాటలో ప్రస్తావన చేసాడు. ఉదాహరణకి నాయుడు అని , కరణం అని ,మున్సిఫ్ అని ప్రస్తావించాడు.

నిజానికి కరణం ఉద్యోగాన్ని బ్రాహ్మణులూ చేసే వారు కాబట్టి వాళ్ళకు పేరు చివరన కరణం ఉంటుంది ,ఆంధ్రలో రాజు అంటే క్షత్రియుడు,కొన్ని ప్రాంతాల్లో రాజులను రెడ్డి అంటారు. నాయుడు అంటే ఊరిని రక్షించేవాడు ఆ ఉద్యోగాన్ని కాపులు చేసారు కాబట్టి కాపులు నాయుడు అని పెట్టుకుంటారు.ఈ ఉద్యోగం చేసే సీమ ఆంధ్రలో ఉండే వాళ్ళు కాబట్టి ఆంధ్రలో ఎక్కువ నాయుడు పేరుతొ ఉంటారు ,ఇదే ఉద్యోగాన్ని తెలంగాణాలో పోలీస్ పటేల్ అనేవారు ఈ ఉద్యోగాన్ని ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తీసివేసాడు మున్సిఫ్ అంటే న్యాయాన్ని కాపాడే ఉద్యోగం ,ఇలా చౌదరి ఉద్యోగం కూడా అటు ఇటు మున్సిఫ్ లాంటిదే. ఈ తరానికి ఈ విషయం తెలియదు. కాని చాల మంది ఈ తోక పేర్ల యొక్క అర్థం తెలియక కులాల పేరుతొ ఎన్ని గొడవలు జరుగుతున్నాయో తెలుసు.

 

 

 

—రవీందర్ ర్యాడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here