కరోనా సంక్షోభంలో ఎందరో ఎన్నో సేవలు చేస్తున్నారు.ప్రతి ఒక్క సామాజిక వేత్త సమాజం పట్ల ప్రేమను చూపుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి అందరికి విభిన్నంగా లాక్ డౌన్ సమయంలో ఆపద వస్తే రక్తం దొరుకదని ఉద్దేశ్యంతో రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిస్తే ఎంతో మంది నటులు జూబ్లీహిల్స్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో రక్తదానం ఇచ్చారు.
ఈ రోజు ప్రముఖ సినీ నటి జ్యోతిరెడ్డి గారు ఈ రోజు మెగాస్టార్ పిలుపుతో మన చిరంజీవి బ్లడ్ బాంక్ లో రక్తదానం చేశారు.ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి, హీరో శ్రీకాంత్, ఆయన కొడుకు రోహన్,మహర్షి రాఘవ లాంటి ప్రముఖులు రక్తాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది.