పాక్ కి షాక్ ఇచ్చిన అమీర్

0
357
aamir khan shock to pak cinima industry
aamir khan shock to pak cinima industry
    అమీర్ ఖాన్ ఒక విలక్షణ బాలీవుడ్ నటుడు. సినిమా సినిమాలో కొత్తదనం ఈ హీరో ప్రత్యేకత. ఈ స్టార్ హీరోకి మన దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడ అభిమానులున్నారు.
    మన పొరుగుదేశం పాకిస్తాన్ లో కూడా తన నటనతో అభిమానులని సొంతం చేసుకున్నాడు ఈ స్టార్ హీరో. ఐతే ఇటీవల కొన్ని కారణాల వల్ల భారతదేశ సినిమాలు పాకిస్తాన్ లో నిలిపివేసారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి సద్దుమనగడంతో అమీర్ తాజా చిత్రం దంగల్ ను అక్కడ ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఆరాటపడుతున్నారు. అందుకు అమీర్ కూడా అంగీకారం తెలిపాడు.
    అయితే పాక్ సెన్సార్ బోర్డ్ ఆ సినిమా క్లైమాక్స్ సీన్స్ లో భారత్ జెండా పైకి ఎగరడం మన జాతీయ గీతం రావడాన్ని తొలగించాలని తెలిపిందటా. దీనిని అమీర్ వ్యతిరేకించి, ఇది ఒక క్రీడకి సంభందించిన సినిమా అని భారత్ – పాక్ శత్రుత్వానికి సంభందం లేదని చెప్పి జాతీయ గీతాన్ని తొలగించేది లేదని చెప్పాడంటా. దంగల్ సినిమాను పాక్ లో ప్రదర్శించేదిలేదని తేల్చి చెప్పాడంటా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here