డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ సంగీత…

0
282
a women in drugs case
a women in drugs case

డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ సంగీత మరో ఆరుగురు యువకులను ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఇవాళ(ఆగస్ట్ 4న) ప్రశ్నించారు పోలీసులు.తాము నైజీరియన్ గ్యాంగ్ నుంచి కొకైన్,గంజాయి తీసుకున్నట్లు ఒప్పుకున్నారు.దీంతో వారినుంచి రక్తం, వెంట్రుకలు, గోళ్లను సేకరించారు.ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.ఇక నిందితుల వారంరోజుల కస్టడీ ముగియటంతో చర్లపల్లి జైలుకు తరలించారు ఎల్బీనగర్ పోలీసులు.ఈ కేసులో సంగీత నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు.డ్రగ్స్ అమ్మకాలే కాకుండా అమ్మాయిల న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతుందన్నారు. నైజీరియన్ గ్యాంగ్ తో పరిచయం ద్వారా నెట్ వర్క్ పెంచుకుని దందా చేస్తున్నట్టు చెబుతున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here