81 లక్షల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్…

0
261
81lak of aadhar cards are deactivated
81lak of aadhar cards are deactivated

ఆధార్ రెగ్యులేష‌న్స్ 2016లోని సెక్షన్ 27, 28 సూచించిన‌ వివిధ కార‌ణాల వ‌ల్ల 81 లక్షల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది కేంద్రం. సరైన పత్రాలు లేకపోవడం, బయోమెట్రిక్ లోపాలు ఉండటం, ఐదేళ్ల లోపు ఆధార్ ఎన్ రోల్ చేసుకున్నవాళ్లు మళ్లీ 15 ఏళ్లకు చేసుకోకపోవడం.. ఇలా వివిధ కారణాల వల్ల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేశారు. ఇప్పటి వరకు 111 కోట్ల ఆధార్ సంఖ్యలు జారీ అయ్యాయి. అయితే ఆధార్ యాక్టివేషన్‌లో ఉందా? డీయాక్టిట్ అయిందా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే … UIDAI వెబ్‌సైట్ https://uidai.gov.in లో లాగ్ ఆన్ అవ్వాలి. వెబ్‌సైట్‌లో ఉండే వెరిఫై ఆధార్ నంబ‌ర్ అన్న ఆప్ష‌న్ ద్వారా స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు. యాక్టివ్‌గా లేక‌పోతే దానికి సంబంధించిన మెసేజ్ వ‌స్తుంది. ఒకవేళ నంబర్ లేకపోతే దగ్గరిలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి కార్డు నమోదు చేసుకోవచ్చు. ఆధార్ ఎన్ రోల్ కు రూ.25 ఖర్చు అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here