39.2 C
Hyderabad
Monday, April 22, 2024
HomeUncategorizedఔట్ సోర్సింగ్ కు కార్పొరేషన్ పట్ల హర్షం

ఔట్ సోర్సింగ్ కు కార్పొరేషన్ పట్ల హర్షం

Date:

Related stories

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...

ఇందూర్ ఎంపీ ఆర్వింద్ ధర్మపురిని కలిసి ధన్యవాదాలు తెలిపిన BJYM రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు.సంతోష్ కుమార్

ఇటీవలే ప్రకటించిన BJYM కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన నాయకుడు సంతోష్...

శీర్షిక: మున్నూరు కాపులము

సాయం అయ్యేటి వ్యవసాయం చేసేము..పంటకు కాపు సైనిక సేవకులమురాజ్య రక్షణలో సాటిలేని...

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ మున్నూరుకాపు మరియు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ...
spot_imgspot_img

బాల్కొండ ఫిబ్రవరి 19:- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలు విని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు కు
నిర్ణయించామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల రాష్ట్ర నేషనల్ ప్రాజెక్ట్ యూనిట్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్ దక్షిణ ఆసియా మైత్రి సదస్సు సెక్రటరీ జనరల్ నర్సింగ్ రావు హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రంలో వివిధ రాజ కీయ నాయకుల కబంధ హస్తాల్లో “ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు” ఉన్నాయని,వీరి ద్వారా ఆయా కార్యాలయాల అధిపతుల ద్వారా పెద్ద మొత్తంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పెద్ద మొత్తంలో వేతనాలు పొంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు నెల నెలా ఇవ్వకుండా మూడు నెలలు లేదా ఆరు నెలలకు ఒకసారి అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ వెట్టి చాకిరి చేయిస్తున్నారని నర్సింగ్ రావు అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పి. యఫ్ బకాయిలు పి. యఫ్ కార్యాలయానికి చెల్లించకుండా ఆయా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లు వేదిస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లగానే తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేసి దాని స్థానంలో ఒక పటిష్ట మైన ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తెలంగాణా రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇచ్చేటట్లు చూస్తామని ప్రకటించడం అభినందనీయం అని నర్సింగ్ హర్షం. వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఎస్.ఆర్ శంకరన్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలు,జూనియర్,డిగ్రీ మరియు అనుబంధ కళాశాలలో అటెండర్ ఉద్యోగం నుండి జూనియర్ అసిస్టెంట్ వరకు “రోస్టర్ సిస్టం” ను అమలు చేయకుండా ఒకే వర్గం వారిని నియమింప జేసారని, ఒక్కో ఉద్యోగానికి రెండు లక్షల నుండి 5 లక్షల వరకు వసూలు చేసి అడ్డగోలుగా నియమాకాలు చేపట్టారని ఈ విషయంపై అనేకసార్లు ఎస్.ఆర్ శంకర ఔట్సోర్సింగ్ కార్యాలయం వద్దకు వెళ్లగా రోజు కార్యాలయం ముందు ఈరోజు సెలవు అనే బోర్డు ఉంటుంది కానీ ఔట్సోర్సింగ్ సిబ్బంది తలుపులు మూసుకొని గదిల్లోనే పని చేస్తూ ఉంటరని ఉద్యోగుల వివరాలు ఇవ్వాల్సిందిగా కోరితే వివరాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నరని ఆయన విమర్శించారు.పైగా ఏస్.అర్.శంకరన్ ఔట్ సోర్సింగ్ ఎజేన్సీ ఫోన్లు ఎప్పుడు అవుట్ ఆఫ్ ఆర్డర్ గా ఉంటాయని నర్సింగ్ రావు అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి బోకస్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల విషయం ముఖ్యమంత్రి పసిగట్టి ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతించారు.పైగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన
బిల్లును అసెంబ్లీ లో ప్రవేశ పెట్టడం హర్షించ దగిందని బి.అర్.నర్సింగ్ రావు హర్షం వ్యక్తం చేశారు.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here