Home Uncategorized నాలుగున్నర దశబ్దాలు గడిచిన రాజకీయ దాహం తీరడం లేదా?

నాలుగున్నర దశబ్దాలు గడిచిన రాజకీయ దాహం తీరడం లేదా?

  • ఒక బిసి బిడ్డను ఓడించి, మరో బిసి బిడ్డను ఓడించేందుకు కుట్రనా?
  • మీ స్థాయికి చిల్లర రాజకీయాలు తగవు.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్.

జగిత్యాల, ఫిబ్రవరి 19: నాలుగున్నర దశబ్దాల రాజకీయ జీవితం గడిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి రాజకీయ దాహం తీరకపోవడం దురదృష్టకరమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్. అన్నారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక కమల నిలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ శ్రావణి గారు మాట్లాడుతూ ఎంపీగా పోటీ చేస్తున్న సందర్బంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఒకరిని గెలిపించడానికి బిసి ఆడ బిడ్డను ఓడించిన జీవన్ రెడ్డి గారు, మళ్ళీ మరో బిసి బిడ్డను ఓడించేందుకు కంకణం కట్టుకున్నరన్నారా అని ప్రశ్నించారు. సుధీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న జీవన్ రెడ్డి గారు అర్వింద్ గారితో అభివృద్ధిలో పోటీ పడాలి, వ్యక్తులను ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప, మా పార్టీలో సస్పెండ్ అయిన వారితో దిష్టి బొమ్మ దహనం చేయించడం, పంప్లెన్ట్ లు పంచడం, మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టవద్దని మీ కుటుంబీకులు అండగా నిలవడం సరికాదన్నారు. దశబ్దాల రాజకీయ జీవితం లో అనేక పదవులు అనుభవించిన మీరు యావర్ రోడ్ విస్తరణ ఎందుకు చేయలేదు? మ్యాంగో మార్కెట్ దుస్థితికి కారకులు ఎవరు? పసుపు, చేరుకు రైతులకు చేసింది ఏంటో చిత్తశుద్ధితో గమనించాలని హితవు పలికారు. మీరు గెలవడం కోసం, మీ కొడుకు వయసున్న అర్వింద్ అన్నకు టికెట్ రాకుండా చేయడం మీ కుటిల బుద్ధికి నిదర్శనంగా భావిస్తున్నామన్నారు. అర్వింద్ కు అహంకారం అంటూ ప్రచారం చేస్తున్నారని ఎక్కడ అర్వింద్ అహంకారం కనిపించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వంగి నమస్కారం పెట్టడంలో కనిపించిందా, పసుపు బోర్డు ప్రకటన, గేజిట్ లో కనిపించిందా, చిన్న పిల్లల శస్త్ర చికిత్సల్లో కనిపించిందా? లేకపోతే కార్యకర్తలకు అండగా నిలవడం లో అర్వింద్ అన్న అహంకారం కనిపించిందా అనేది జీవన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు, మీ కుటుంబ సభ్యులు అర్వింద్ గారి కళ్లద్దాల గురించి మాట్లాడ్డం విడ్డురంగా ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు, ప్రపంచ దేశాల్లో మోదీ మానియా కొనసాగుతుందని, ఎంపీగా పోటీ చేసి మీరు చేసేది ఏముందని ప్రశ్నించారు. మీ స్థాయి కి ఇలాంటి చిల్లర రాజకీయాలు తగవని, ఎమ్మెల్సీ గానే కొనసాగుతూ ప్రజా సేవలో ఉండండి తప్ప, బిసి బిడ్డను ఒదించేందుకు చిల్లర, కుటిల రాజకీయా కుట్రలు చేయవద్దని జీవన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు అనుమల్ల కృష్ణ హరి, జిల్లా కోశాధికారి సుంకట దశరథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలవాల తిరుపతి, అర్బన్ మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజాం, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆముద రాజు, సిరికొండ రాజన్న,పవన్ సింగ్, మమత, మల్లీశ్వరి మరియు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version