32.2 C
Hyderabad
Tuesday, May 21, 2024
HomeUncategorizedసరోజినీ నాయుడు జయంతి - జాతీయ మహిళా దినోత్సవం

సరోజినీ నాయుడు జయంతి – జాతీయ మహిళా దినోత్సవం

Date:

Related stories

షరతులు వర్తిస్తాయి…!

ఏం చెప్పాలి ఈ సినిమా గురించి, చెప్పేదానికన్నా చూస్తనే మంచిగుంటది. మరి...

అంశం : ఎన్నికలుశీర్షిక: సామాన్యుడి సమయం

సామాన్యుడే దిక్సూచైపాలించే వ్యవస్థ ఎంపిక కొరకుప్రజాశక్తి నిరూపించుకునే సమయంరాజ్యాంగం ఇచ్చిన హక్కునువినియోగించుకునే...

చేవెళ్లలో కొండ విశ్వేశ్వరెడ్డి గారి విజయం ఖాయం

బీజేవైఎం కొండాపూర్ డివిజన్ నాయకులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ జూన్ 4న...

రేంజర్ల గ్రామంలో ఉపాధి హామి కార్మికుల దగ్గర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవీందర్ ర్యాడ

ఈరోజు శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ నరేంద్ర మోదీ గారిని...

నవభారత వికాస దార్శనికుడు….

(ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం) నవ భారత...
spot_imgspot_img

భారత కోకిలగా (నైటింగేల్ ఆఫ్ ఇండియా) ప్రసిద్ధిగాంచిన సరోజినీ నాయుడు. స్వాతంత్ర్య సమరయోధురాలు, స్వతంత్ర భారత దేశంలో మొట్ట మొదటి మహిళా గవర్నర్, గొప్ప రచయిత్రి, మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచారు. ఆమె సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం సరోజినీ నాయుడు జన్మదినం అయిన ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.

లండన్‌ కింగ్స్‌ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన సరోజినీ నాయుడు.. తన 13వ ఏటనే రచయితగా మారిన సరోజినీ ‘లేడి ఆఫ్ ది లేక్’ రాసింది. తన రచనలతో బ్రిటిష్ విమర్శకులను సైతం మెప్పించారు. ‘బర్డ్‌ ఆఫ్‌ ది టైం’, ‘ది గోల్డెన్‌ థ్రెషోల్డ్‌’, ‘ది బ్రోకెన్‌ వింగ్స్‌’, ‘ఫెదర్ ఆఫ్ డాన్’ ఆమె రచనలలో ప్రసిద్ధమైనవి. అంతేకాదు, ‘ఫీస్ట్‌ ఆఫ్‌ యూత్‌, ది మ్యాజిక్‌ ట్రీ, ది విజార్డ్‌ మాస్క్‌, ఎ ట్రెజరీ ఆఫ్‌ పొయెం ‘ లు సరోజినీ నాయుడు ఆంగ్ల సాహిత్యానికి మచ్చుతునకలు. ఇంగ్లీషు పద్యాలలో భారతీయ ఆత్మ ప్రతిఫలిస్తుంది. అంతేకాదు, పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా వినసొంపుగా పండటంతో ఆమెను భారత కోకిల అని పిలిచేవారు…

గోపాల కృష్ణ గోఖలే సూచనలతో 1905లో కాంగ్రెస్‌ సభ్యురాలిగా చేరిన సరోజినీ నాయుడు.. 1915లో గాంధీజీని కలిసిన తర్వాత జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. తన వాడియైన ప్రసంగాలు, ఉపన్యాసాలతో ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. ఐరిస్ వనిత అనిబిసెంట్‌ అధ్యక్షతన భారత మహిళా సమాఖ్య స్థాపన 1917లో ఏర్పాటుకు సహకరించి మహిళ ఓటు హక్కు కోసం సిఫారసు చేశారు.

1919లో మాంటెంగ్ ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ‘ఖిలాపత్‌’ ఉద్యమం, రౌలత్‌ చట్టం, ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అప్పుడే భారత హోం రూల్‌ ప్రతినిధిగా లండన్‌ వెళ్లారు. ఇంగ్లాండులో ఉన్నప్పటికీ భారతీయుల జీవితాలను ప్రతిబింబిస్తూ రచనలు చేశారు….

ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో ముత్యాల గోవిందరాజులునాయుడిని కులాంతర వివాహం చేసుకుని.. మానవ జీవితానికి కుల, మతాల కన్నా మానవత్వమే ముఖ్యమని విశ్వసించారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సామాజిక సేవలో విశేష కృషి చేశారు. మహిళలకు విద్య అవసరాన్ని వివరించిన ఆమె వారిలో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. 1949 మార్చి 2న సరోజినినాయుడు తన 70వఏట ఈ లోకాన్ని విడిచివెళ్లారు.

– శేరు పోశెట్టి, ఆర్మూర్.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here