Home రాజకీయాలు లోక్ సభ ఎన్నికలలో స్థానిక అభ్యర్థి తోనే అభివృద్ధి సాధ్యం – మున్నూరు రవి

లోక్ సభ ఎన్నికలలో స్థానిక అభ్యర్థి తోనే అభివృద్ధి సాధ్యం – మున్నూరు రవి

ప్రెస్ మీట్ జడ్చర్ల టి ఎన్ జి ఓ భవన్ : (10.02.2024)

మన ఊరు మన అభివృద్ధిలో భాగంగా శనివారం జడ్చర్లలో మహబూబ్ నగర్ డెవలప్ మెంట్ ఫోరం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
గతంలో ప్రజా పతినిధులుగా ఎన్నికయిన వారు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారన్నారు. స్థానికంగా అవగాహన ఉన్న వారు , ఇక్కడి ప్రజలతో సత్సంబంధాలు కలిగివున్నా కూడా ఇక్కడి నేతలకు అవకాశం లేకుండా పోతుందన్నారు. ఇప్పటివరకు ఎంపీలుగా ఎన్నికైనా వాళ్లలో కేవలం ఇద్దరు స్థానికులు మాత్రమే ఎంపిలుగా ఎన్నికైనారు. అన్ని రాజకీయ పార్టీల్లో స్థానికంగా ప్రజాసేవ చేయగలిగే నాయకులకు టికెట్ ఇస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మాట్లాడారు.
ప్రజలు కూడా ఈ విషయంపై ఆలోచించాలన్నారు.
రాజ్యాంగ ప్రకారం దేశంలో ఎక్కడైనా పోటీ చేసే స్వేచ్ఛ ఉందని దానికి మేము వ్యతిరేకం కాదు కాని మా ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా. .
అభివృద్ధి కోసం ఇక్కడి ప్రజల అభీష్టం మేరకే ఈ డిమాండ్ ని లేవనేత్తమన్నారు.. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపడానికి రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారిణి , సామాజిక కార్యకర్త సాజిదా సికిందర్,
రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జహంగీర్ పాషా, సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ లతో పాటు వివిధ కుల సంఘాల నాయకులు, మేధావులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో యం.డి.ఎఫ్ చైర్మెన్ మున్నూరు రవి , గౌరవాధ్యక్షులు కేంద్ర చేనేత, జౌలి శాఖ బోర్డ్ మాజీ సభ్యులు సారంగి వినయ్ కుమార్, , జడ్చర్ల యం.డి.ఎఫ్ కన్వీనర్ సీనియర్ అడ్వకెట్ నర్సింగ్ రావు, మాజీ కౌన్సిలర్ యం.డి.ఎఫ్ మైనార్టీ విభాగం కన్వీనర్ మసీవుద్దీన్, సంస్థ సభ్యులు పటేల్ వెంకటేష్ , ముసంగి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version