24.2 C
Hyderabad
Tuesday, March 5, 2024
Homeసినిమామీకు అర్థం అవుతుందా..?

మీకు అర్థం అవుతుందా..?

Date:

Related stories

మోడీ పై విన్నూత్న రీతిలో అభిమానం చాటిన యువ రైతు

మోడీ పైన తనకున్న అభిమానాన్ని తోట మహేష్ అనే యూవరైతు MODI...
spot_imgspot_img

అదేదో సినిమాలో బ్రహ్మనందం డైలాగ్. ఒక్కొక్కసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందా అని. పాట అంటే అన్ని మరిచిపోయి మనుసుకు హాయిని గొలిపేలా ఉండేది. వింటూంటే ఇంకా ఇంకా వినాలి అనిపిచ్చేది. కనిప్పుడు సినిమానే కాదు. పాటను కూడా పదిమందిలో వినాలి, పిల్లలతో చూడాలి అంటే…పాటతో పాటు బొమ్మ కూడా ద్యావుడా అనుకునేలా దద్దరిల్లిపోతుంది. నిజంగానే గుంటూరు కారంలో వచ్చిన సాంగ్ వింటే చాలమందికి అలాంటి ఫీలింగే. మీ నుంచి “సాగర సంగమం, స్వాతిముత్యం” లాంటి సంస్కరవంతమైన పాటలు రాకపోయిన పర్లేదు కానీ. ఏంటీ ఈ బూతు “కుర్చిని మడుత పెట్టి”. ఈ పాట రాసింది ఎవరో కాదు. “సరస్వతి పుత్ర” అని తనకు తానే ఓ బిరుదు తగిలించుకున్న రచయిత రామజోగయ్య శాస్త్రి. ఎన్నో మంచి మంచి పాటలు రాసిన ఈయన…ఎందుకో మరి శృతి, గతి తప్పి రాసిన్నట్టున్నాడు. తీసింది కూడా అల్లటప్ప డైరెక్టర్ కాదు. గురూజీ త్రివిక్రమ్. మరి గుంటూరు కారంలో ఘాటు లేదేమో, లేక కథలో “ఖలేజా” లేదోమో. ఇలాంటి సిచ్యూవేషన్ లోనే డైరెక్టర్లు కాంట్రావర్సిలకు వెళ్తారనే టాక్. గతంలో ఈ పెద్దమనిషే ప్రేక్షకుల తాలుకు అర్థం లేని తనం, హీరోలకు తాలుకు ఇమేజులని…గొప్ప గొప్ప మాటలే చెప్పాడు. కమర్షియల్ సినిమా అంటే దిగజారుడు సాహిత్యమేనా త్రివిక్రమ్ గారు. అయినా మహేష్ బాబుకైన “బాధ్యతుండకర్లేదా”? ఈ స్టెప్పులేంటీ, ఆ కుర్చేంటీ వస్తున్న పాటేంటీ. సగటు తెలుగు జనం…మీ నుంచి ఏం ఆశిస్తున్నరో మీకు అర్థం కావట్లేదా? రచయిత ఏం రాస్తే అది, డైరెక్టర్ ఏదీ తీస్తే అది గుడ్డిగా వెళ్లిపోవడమేనా హీరోయిజం అంటే. ఆడియో ఫంక్షన్లప్పుడు ఇచ్చే ఏతులు, కొట్టే ఫోజులు, నీతివంతమైన డైలాగులు కూడా, సినిమాలో ఉండేతట్టు చూసుకోండి సార్. తమన్ జరంత కొత్త ట్యూన్లు ఇస్తే ప్రేక్షకులు నిన్ను ఎక్కడికో…తీసుకెళ్తారు బాసూ. మీరు తెలుగు సినిమా స్థాయిని పెంచకపోయిన పర్వాలేదు కానీ…ఇలా పదిమంది నవ్వుకునేతట్టు మాత్రం చెయ్యకండి. లేదు మా కుర్చి మా ఇష్టం… ఎక్కడైన మడుతపెట్టుకుంటాం అంటరా మీ ఇష్టం.

M. సంతోష్ జర్నలిస్ట్

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here