24.2 C
Hyderabad
Tuesday, March 5, 2024
Homeరాజకీయాలుఏఐసీసీ కీలక కమిటీలో తెలంగాణ రాష్ట్ర కో - ఆర్డినేటర్ గా ఆదిలాబాద్ జిల్లా వాసి...

ఏఐసీసీ కీలక కమిటీలో తెలంగాణ రాష్ట్ర కో – ఆర్డినేటర్ గా ఆదిలాబాద్ జిల్లా వాసి తుల అరుణ్ కుమార్ నియామకం

Date:

Related stories

మోడీ పై విన్నూత్న రీతిలో అభిమానం చాటిన యువ రైతు

మోడీ పైన తనకున్న అభిమానాన్ని తోట మహేష్ అనే యూవరైతు MODI...
spot_imgspot_img

Press note:

కాంగ్రెస్ పార్టీ యొక్క మేధో విభాగం కమిటీకి రాష్ట్ర కో – ఆర్డినేటర్ గా నియమితులైన తుల అరుణ్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంఖా మ్రోగించి అధికారం చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే.పదేండ్ల తరువాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ కార్యకర్తలకు,కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలకు పదవులు వరిస్తున్నాయి.అనూహ్యంగా ఢిల్లీ అధిష్టానం నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు కీలక విభాగాల్లో ముఖ్య పదవులను తెలంగాణాకు చెందిన యువ నాయకులను ఎంపిక చేసి నియామకం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో పార్టీ బలోపేతం కోసం,కార్యకర్తలకు అండగా ఉంటూ,నేనున్నాననే భరోసా కల్పిస్తూ విజయతీరాలకు చేర్చెలా తమవంతు సహాయ సహకారాలు అందించిన యువ నాయకులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి సేవలకు గుర్తింపుగా అక్కున చేర్చుకొని ప్రతిఫలంగా అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ కీలక విభాగాలలో మంచి పదవులను ఇచ్చి పార్టీని ఇంకా రాబోయే ఇతరత్రా ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చెలా యువ నాయకులకు పదవుల రూపంలో బిగ్ బూస్ట్ అందిస్తోంది.అందులో భాగంగా అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీలో ( ఏఐసీసీ ) కీలక విభాగం అయిన ఏఐసీసీ మేధో విభాగంలో అదిలాబాద్ జిల్లాకు చెందిన యువ నాయకున్ని తెలంగాణ రాష్ట్ర కో – ఆర్డినేటర్ గా నియమించారు…

ఏఐసీసీ అనుబంధ విభాగం అయిన కాంగ్రెస్ పార్టీ మేధో విభాగంలో ” ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ విచార్ విభాగ్ ” కు తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ గా దివంగత నేత తుల సుభాష్ ( ఉమ్మడి రాష్ట్ర ( ఏపీ )కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ) గారి తనయుడు ప్రముఖ సామాజిక సేవకులు,కాంగ్రెస్ పార్టీ యువ నేత తుల అరుణ్ కుమార్ ను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ విచార్ విభాగ్ చైర్ పర్సన్ డాక్టర్ గిరిజా వ్యాస్ గారు నియమించారు. విచార్ విభాగ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మేధో విభాగం.పార్టీ సిద్ధాంతాలు మరియు విధానాలను ప్రజలకు వ్యాప్తి చెయ్యడానికి ఈ విభాగం బాధ్యత వహిస్తుంది.కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన విభాగం గా ఈ కమిటీ పేరొందింది.కాంగ్రెస్ పార్టీ కీలక కమిటీలో నియామకం పట్ల తుల అరుణ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తున్నారు…

తుల అరుణ్ కుమార్ గారి తండ్రి దివంగత నేత తుల సుభాష్ తన మరణాంతరం వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరియు కాంగ్రెస్ శ్రేణులకు అండగా ఉంటూ,కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.ఆనాటి కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయానికి అనిర్వచనీయ కృషిగావించారు.తండ్రి మరణానంతరం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని తుల అరుణ్ కుమార్ తన తండ్రి పేరుమీదే వెల్ఫేర్ సొసైటీనీ స్థాపించి అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా కష్ట కాలంలో కూడా పేదలకు,బడుగు బలహీనవర్గాలకు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు అందించారు.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన నాయకులు చెప్పినట్లుగా వివిధ రకాల పార్టీ కార్యక్రమాల్లో తూచా తప్పకుండా పాల్గొంటూ,పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ,కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ,యువ నాయకత్వాన్ని పోషిస్తూ,యువ నాయకుల చేరికలో కీలక పాత్ర పోషించారు.పైన తెలిపిన విధంగా ఇలాంటి అన్నీ రకాల అంశాలను వివరంగా పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసీసీ లో కీలక విభాగం అయిన కాంగ్రెస్ పార్టీ మేధో విభాగం లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ గా నియమించింది.భవిష్యత్తులో రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులకు అండగా ఉందనే భావన తేవడానికి కీలకమైన విభాగాలలో నియామకాలు చేస్తోంది.

ఏదేమైనప్పటికీ అడవుల జిల్లాగా పేరుగాంచిన మారుమూల నియోజకవర్గం అయిన భోథ్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యొక్క కీలకమైన మేధో విభాగంలో ( విచార్ విభాగ్ ) తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ గా నియామకం అయిన తుల అరుణ్ కుమార్ ను ఆయన అనుచరులు ,అభిమానులు అభినందిస్తున్నారు.ఈ నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీకి అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు,తుల అరుణ్ కుమార్ అభిమానులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు…..

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here