24.2 C
Hyderabad
Tuesday, March 5, 2024
Homeరాజకీయాలుజాతీయ ప్రకృతి దినోత్సవం సందర్భంగా ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం

జాతీయ ప్రకృతి దినోత్సవం సందర్భంగా ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం

Date:

Related stories

మోడీ పై విన్నూత్న రీతిలో అభిమానం చాటిన యువ రైతు

మోడీ పైన తనకున్న అభిమానాన్ని తోట మహేష్ అనే యూవరైతు MODI...
spot_imgspot_img

జాతీయ ప్రకృతి దినోత్సవం సందర్భంగా ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం

  ————————————————–

తెలంగాణ కబుర్లు/నవంబర్ 16/పెద్దపల్లి

జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవమును పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు “మానవ జీవన విధానంలో ప్రకృతి పాత్ర” అను అంశంపై తెలుగు భాషలో ఉపన్యాస పోటీలు ఎమ్మార్సీ పెద్దపల్లిలో నేడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న క్వాలిటీ కోఆర్డినేటర్ పి యం. షేక్. మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించుకోవాలనే స్పృహ బాల్యంలోనే పిల్లలకు అవగాహన పరచడానికి, ప్రకృతి విధ్వంసం వలన ప్రాణులకు తీవ్ర నష్టం కలుగుతుందనే పరిస్థితిని అర్థం చేయించడానికి ఈ ఉపన్యాస పోటీలు దోహదపడతాయని అన్నారు.

విజేతలు

1. పి.సింధుజ కేజీవీబీ రామగిరి

2. ఎండి అంజమ్ సుల్తానా జెడ్ పి హెచ్ ఎస్ కమాన్పూర్

3. బి.ఆదిత్య తేజ జడ్పిహెచ్ఎస్ బాయ్స్ మంథని

జిల్లాస్థాయి పోటీలలో ప్రధమ బహుమతి పొందిన విద్యార్థి పి సింధుజను నవంబరు 18వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పెద్దపల్లి జిల్లా తరఫున పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షులు మార రమేష్, ప్రధాన కార్యదర్శి గడ్డం రాజనర్సు మరియు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దపల్లి మండల విద్యాధికారి పి. సురేంద్ర కుమార్, ఎంఎన్ఓ  ఆగయ్య మరియు పెద్దపెల్లి జిల్లాలోని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కేడియం శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, వాణిశ్రీ,లింగం శ్రీనివాస్, కేఎస్ఎన్ మూర్తి, గంగారెడ్డి, వనపర్తి అంజయ్య, పట్టెం వెంకటేష్, మూల శ్రీనివాస్, సరోజ్ శర్మ, రజిత తదితరులు పాల్గొన్నారు

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here