Home కవితలు - రాతలు ఇదంతా మామూలే

ఇదంతా మామూలే

ఇదంతా మామూలే

మన బ్రతుకుల్ని అయిదేళ్ళు వాడికి తాకట్టు పెట్టాక
హమిలిచ్చినప్పుడు హార్షద్వానాలతో మురవడం
వాతలు పెట్టినప్పుడు రోడ్డెక్కి అరవడం
ఇదంతా మామూలే!

గాయంతో మనం ములిగినపుడు వాడు సబ్సిడీల వెన్న రాయడం మామూలే!
వాడెంత బరువు మోపిన ఒరగడం తప్ప
మన నడ్డి విరగడం మామూలే !

మన మతిమరుపు మీద యెనలేని నమ్మకం వాడికి
ఐదేళ్ల తరువాత కూడా అదే స్లోగన్ తో వచ్చినా..
మనం గుర్తించలేక పోవడం మామూలే!

దేశాన్ని దేవాలయం అంటాడు, మనల్ని దేవుళ్ళంటాడు
అంతదానికే మనం విదేయులం అయిపోయి
మరో ఐదేళ్లు రాసి ఇవ్వడం మామూలే!

వెనక్కి వెళ్ళి గత ఏడు దశాబ్దాల చరిత్ర చూస్తే..
ఇదంతా మామూలే!!

– శేరు పోశెట్టి, ఆర్మూర్

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version