‘మిస్‌ వరల్డ్‌ కెనడా–2017’ పోటీల్లో ఎంపికైన తెలుగమ్మాయి…

0
350
kalyanapu sravya selected in 2017 Miss World Canada..
kalyanapu sravya selected in 2017 Miss World Canada..
    ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన కల్యాణపు శ్రావ్య ‘మిస్‌ వరల్డ్‌ కెనడా–2017’ పోటీల్లో ఫైనల్‌కు ఎంపికైంది. కెనడాలోని టొరంటోలో జరుగుతున్న ఈ పోటీల్లో ప్రతీ కేటగిరీలో విజయం సాధిస్తూ.. ఫైనల్ కు చేరుకుంది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో ‘మిస్‌ నార్తర్న్‌ ఆల్బర్టా వరల్డ్‌– 2017’కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌ పోటీలో శ్రావ్య హావభావాలతో పాటు ఆమె నడవడిక, ప్రవర్తన తదితర వాటిని గమనిస్తారు. దీంతోపాటు ఓటింగ్‌ శాతాన్ని కూడా పరిశీలించి అన్నింట్లో ముందంజలో ఉంటే అప్పుడు ఆమె మిస్‌వరల్డ్‌ కెనాడాగా నిలుస్తుంది.
    శ్రావ్యకు ఓటింగ్‌ వేసి తనని గెలిపించాలని ఆమె తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రావ్యకు వోట్ చేయాలనుకున్న వారు http://missworldcanada.net/2017-finalists/?contest=photo-detail&photo_id=1461 ద్వారా ఈ నెల 22 సాయంత్రం వరకు ఓటింగ్‌ వేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here