కవిత ఓటమికి 11 కారణాలు

0
580

1) పసుపు రైతుల ఆందోళన తిరిగి తిరిగి కవిత మెడకు చుట్టుకుంది. మొదట్లో ఈ విషయాన్నీ తెరాస వర్గాలు తేలికగా తీసుకున్నాయి ఎందుకంటే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పోచంపాడ్ ప్రాజెక్టు అర టిఎంసి నీళ్ళను మిషన్ భగీరథ కు తరలించడంతో అపుడు కూడా పెద్ద ఆందోళనలు జరిగాయి. కాని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం కనపడలేదు. పసుపు రైతుల ఆందోళనలు కూడా సీన్ రిపీట్ అవుతుందని భావించారు,కాని ఈ ఇష్యూ కాస్త జాతీయ ఇష్యూ గా మారి చిలికి చిలికి గాలి వానగా మారింది.
2) నియోజకవర్గంలో గల్ఫ్ బాధితులు ఎక్కువ. తెలంగాణ వస్తే ఎన్నారై పాలసీ వస్తుందని అందరు భావించారు. కాని అది అమలు కాలేదు. ఈ సమయంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ గల్ఫ్ కార్మికులకు బాగా దగ్గర అయ్యారు. దీంతో గల్ఫ్ లో ఉన్న కార్మికులు ఇళ్లకు ఫోన్ చేసి బీజేపీ కి ఓటు వేయాలని చెప్పటంతో మేజర్ ఓట్లు వెళ్లిపోయాయి.
3) గత ప్రభుత్వంలో తెరాసలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రాక రెబల్స్ గా మారి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు(ఉదాహరణకు ఆర్మూరులో వినయ్ రెడ్డి లాంటివాళ్లు ) పార్లమెంట్ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపెట్టారు.

4) కేసీఆర్ గారు హిందువుల మీద చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ప్లస్ అయ్యాయి.

6) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు కాంగ్రెస్ కి వెలితే,పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయింది.

7) కొన్ని స్థానాల్లో తెరాస వర్గాలు పనిచేయలేవు దానిక్కారణం అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస కు ప్రత్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి ఈ ఎన్నికల్లో తెరాసలో చేరటం ,కవితతో పాటు గెలిచిన ఎమ్మెల్యే,ఓడిపోయినా అభ్యర్థి ప్రచారాల్లో పాల్గొనటం వల్ల కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు.

8) ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపులు ఎక్కువ ఉంటారు. ప్రముఖ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ గారికి చాల రాజకీయ అనుబంధాలు ఈ వర్గంతో ఉన్నాయి. కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద క్రమశిక్షణ ఫిర్యాదు చేయటం వల్ల ఆయనకు జరిగిన అవమానం మొత్తం కులస్తులకు జరిగిన భావనతో ఈ సామజిక వర్గం ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి.
9) 2014 ఎన్నికల్లో కాబోయే సీఎం కెసిఆర్ కూతురు అనే ఇమేజ్ బాగా ఉండేది. దాంతో గెలిచాక ప్రజల్లో ఆమె మీద అంచనాలు ఎక్కువ ఉండేవి. దాంతో ప్రజలు అనుకున్న అంచనాలు అందుకోకపోవటం మైనస్ . కవిత గారు గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవటం ఆమె మీద ప్రజలకు నమ్మకం సడలిపోయింది. ప్రధానంగా షుగర్ ఫ్యాక్టరీల పునరుద్దరణ కాకపోవటం పెద్ద మైనస్ పాయింట్. దీనితో
10) కవిత గారు ఓడిపోవడానికి ఎవరెవరో ఎన్నో కారణాలు చెబుతున్న ఎప్పుడైతే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు గారి ఇంటికి సీఎం కెసిఆర్ వెళ్లారో అపుడే ఓటమి ఖాయమైంది అని చెప్పవచ్చు.అప్పటికే రైతులు,గల్ఫ్ బాధితులు దూరం అయ్యారు,కానీ ఈ సంఘటన వల్ల తెలంగాణ వాదులు దూరం అయ్యారు.కూతురు గెలుపు కోసం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వర్గానికి చెందిన వ్యక్తి ఇంటికి వెళ్ళటం తెలంగాణ వాదులకు నచ్చలేదు.

11) వీటితో పాటు బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేస్తున్న సామజిక సేవలు జనాల్లోకి బాగా వెళ్లాయి. దానికి తోడు పుల్వామా ఘటన కూడా చాలా ప్రభావితం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here