చెత్త కుప్పలో 16 లక్షల రూపాయల పాత నోట్లు…

0
289
1000-and-500-rupees-old-notes-found-in-dustbin
1000-and-500-rupees-old-notes-found-in-dustbin

హైదరాబాద్ సిటీ మేడ్చల్ జిల్లా నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాజ్ పేయ్ నగర్ ఏరియాలో చిత్తు కాగితాలు ఏరుకునే ఆమెకి GHMC డస్ట్ బిన్ దగ్గర కాగితాలు ఏరుకుంటుంటే ఓ నల్లటి కవర్ కనిపించింది. అందులో ఏదో చెత్త ఉంటుందనుకుని కవర్ తీసుకుని దులపగా అందులో నుంచి నోట్ల కట్టలు బయట పడ్డాయి. అన్నీ రూ.500, వెయ్యి నోట్లే. మొత్తం 16 లక్షల రూపాయల విలువైన కరెన్సీ కట్టలు. అయితే అవన్నీ రద్దయిన పాత నోట్లు… దీంతో ఆమె నేరుగా నేరెడ్ మెంట్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చింది. పోలీసులు వెళ్లి ఆ నోట్ల కట్టలను స్టేషన్ కు తీసుకొచ్చి దొరికిన నోట్ల కట్టలపై కేసు నమోదు చేశారు. ఎవరివో ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here