స్మార్ట్ సిటీస్ -డర్టీ పాలిటిక్స్

0
691

 

స్మార్ట్ సిటీ ………… స్మార్ట్ సిటీ ………… స్మార్ట్ సిటీ ………… బిజెపి అధికారం లోకి వచ్చాక స్వచ్ భారత్ ,జన ధన లాంటి పదాల తర్వాత బాగా ప్రాచుర్యం పొందిన పదం . కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎప్పుడు నోరు తెరిచినా నరేంద్ర మోడీ పేరు కన్న స్మార్ట్ అనే పదం వచ్చిదంటే ఈ పదం ప్రజల్లోకి ఎంత చోచుకుపోయిందో తెలుస్తుంది . ప్రపంచంలోని పెద్ద నగరాలైన న్యూ యార్క్ ,జెర్సీ ,డలాస్,సింగపూర్ ,మెల్బోర్న్ ,లండన్ లాంటి నగరాల స్ఫూర్తి తో మన నగరాలను  నిర్మించి వేయాలని మోడీ గారి ప్లాను . ప్లాన్ బాగుంది కాని దానిలో ఎన్ని వ్యూహాలు ,పన్నాగాలు ఉన్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు .

ఐతే నిన్న స్మార్ట్ సిటీ ల యొక్క లిస్టు వచ్చింది ,ఆ  లిస్టు చూస్తె మాత్రం మోడీ పైన ఉన్న అబిప్రాయం మార్చుకోవచ్చు ఎందుకంటే వోట్ బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్ లో ఉన్నంత గా బిజెపి లో కనిపించవు కాని మోడీ  కాంగ్రెస్ భావాలున్న  బిజెపి నాయకుడు అని చెప్పోచేమో . ఎందుకంటే స్మార్ట్ సిటీ ల ఎంపిక చూస్తె అది నిజమనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన ఆంద్ర ,తెలంగాణాల్లో కేవలం 5 నగరాలను ఎంపిక చేస్తే ఎన్నికలు ముందున్న తమిళనాడు ,ఉత్తరప్రదేశ్ లలో ఒక్కొక్క స్టేట్ కి 12 కి పైగా ఇచ్చారు . తన సొంత రాష్ట్రానికి కూడా బాగానే ఇచ్చుకున్నాడు . తెలంగాణా లో నిజామాబాద్,కరీంనగర్ లకి స్మార్ట్ హోదా వస్తుందనుకున్న తరుణంలో కేంద్రం షాక్ ఇచ్చింది ఎందుకంటే అక్కడ కెసిఆర్ కుటుంబ సబ్యులు mp లు గా ఉన్నారు కాబట్టి .
ఏమైనా సరే స్మార్ట్ నగరాల ఎంపిక స్మార్ట్ గా లేదని చెవులు కోరుకుంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here