జనసేన ని మరో ప్రజారాజ్యం లా మార్చడానికి తెర వెనుక కుట్రలు

0
260

ఇంగ్లీష్ వైద్యంలో ఒక సామెత ఉంటుంది…ఆపరేషన్ సక్సెస్..పేషేంట్ డెడ్ అని.చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ని కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.సామాజిక న్యాయం కోసం స్థాపించబడిన ప్రజారాజ్యం పార్టీ 100 మంది బీసీలకు,శ్రవణ్ దాసోజు లాంటి మేధావులకు,తోట చంద్రశేఖర్ లాంటి అడ్మినిస్ట్రేటర్ కు,తుపాకుల మణెమ్మ లాంటి చైతన్యం ఉన్న సామాన్య పౌరులకు,పోసాని కృష్ణ మురళి లాంటి నిజాయితిపరులకు,అనిల్ ఈరవత్రి లాంటి యువకులకు టిక్కెట్లు ఇచ్చి తాను అనుకున్న పంథాను ఎన్నికల్లో కొనసాగించారు.కాని అప్పుడున్న ప్రతిపక్షపార్టీల మీడియాలు విష ప్రచారం వల్ల ప్రజారాజ్యం ఓడిపోయింది,కానీ ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు వేరే పార్టీలు అమలు చేయటం మొదలు పెట్టాయి.ప్రధానంగా బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వడం అప్పటినుంచి మొదలైందని చెప్పాలి.చివరికి ఈ మీడియాలు పీఆర్పీ ని నామరూపాలు లేకుండా చేసేవరకు నిద్రపోలేదు.

అయితె చిరంజీవి గారి వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి జాగ్రత్తగా ఆడుగులు వేస్తూ ప్రస్థానం సాగిస్తున్నారు. ప్రధానంగా క్యాడర్ నిర్మాణం, పాత చింతకాయలను నమ్మకపోవడం,పదవి కాంక్ష చూయించకపోవడం లాంటి అంశాల వల్ల ప్రత్యర్థులకు అవకాశాలు దొరకడం లేదు.ఇది గమనించిన ప్రత్యర్ధులు పవన్ ని రోజు శీల పరీక్ష చేస్తూ జనాల్లో ఆయనకున్న నమ్మకాన్ని సడలించే యత్నం ఇరు పార్టీలు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుసిపోతుంది.ఉదాహరణకి టీడీపి ఏమో జనసేన వైఎస్ఆర్ సీపీ,బీజేపీ లతో కుమ్మక్కయిందని చెబితే ,జగన్ మాత్రం పవన్ బాబులు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని సాక్షిలో మొదటి పేజీలో హైలైట్ అయ్యేవిదంగా ప్రచురించాయి(అదే రోజు ఆంధ్రలో చంద్రబాబు హెలిప్యాడ్ కోసం చనిపోయిన రైతు వార్త లోపలి పేజీల్లో వేయడం ఇక్కడ గమనించాలి).

ఈ వార్తకు పవన్ ట్విట్టర్లో స్పందించి కౌంటర్ ఇవ్వడం తెలిసిందే(వాస్తవానికి పవన్ ఇలాంటి గత 4 ఏళ్లలో ఇచ్చిన కౌంటర్లు కోకొల్లలు).అయితె ఈ వార్తను మాత్రం ప్రతి వార్త పత్రిక మొదటి పేజీల్లో వేయాలి ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు మార్చే ఒక వార్తకు కౌంటర్ ని పవన్ లాంటి జనాకర్షక నాయకుడు ఇచ్చినప్పుడు ఆ వార్తను హైలైట్ చేయాలి. కాని అది జరగలేదు.సాక్షిలో అయితె ఎక్కడో మూలకు ఈ వార్త వేసి,పవన్ సరిగ్గా కౌంటర్ వేయలేదు అని చేతులు దులుపుకుంది.ఇంతే కాకుండా 10 రోజుల క్రీతం బాబు మాట్లాడుతూ పవన్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటుందని ఒక ఫీలర్ వదిలాడు.కాని జనసేన పార్టీ పెద్దలు అలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలుస్తుంది.

ఈ పరిణామాలు చూస్తుంటే టీడీపీ,జగన్ వైఎస్ కాంగ్రెస్ పార్టీలు జనసేన పార్టీని ప్రజారాజ్యం లా మార్చాలని కుట్రలు పన్నుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.

ఈసారి అయిన ఆంధ్ర ప్రజలు జనసేన లాంటి పార్టీని బతికించుకుని కొత్త రాజకీయాలకు కేంద్రబిందువు కావాలని కోరుకుందాం.

రవీందర్ ర్యాడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here